Begin typing your search above and press return to search.
పాపం.. ప్రగ్యాను పట్టించుకునే నాధుడే లేడా..?
By: Tupaki Desk | 27 March 2022 11:30 PM GMTప్రగ్యా జైస్వాల్.. ఈ అందాల భామ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఎన్నో పాపులర్ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించింది. 2014లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రమైన `డేగ`తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత అభిజిత్ సరసన `మిర్చిలాంటి కుర్రాడు` అనే సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో ఎవరికీ పెద్దగా తెలీదు.
అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన `కంచె` సినిమాలో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ నటకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ, ఆపై ఈమె చేసిన ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ఆకర్షించే అందం, అంతకు మించిన ట్యాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం లేకపోవడం వల్ల ప్రగ్యా సినీ కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. ఇక అలాంటి తరుణంలో వచ్చిన ఆఫరే `అఖండ`. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు.
ఈ మూవీ గనుక హిట్టైతే.. ప్రగ్యా దశ తిరుగుతుందని, ఆమెకు మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతాయని అందరూ భావించారు. అనుకున్నట్లే గత ఏడాది డిసెంబర్ 2న అఖండ విడుదలై భారీ విజయం సాధించింది. కానీ, ప్రగ్యా దశ మాత్రం తిరగలేదు. అసలు ఆమెను పట్టించుకునే నాధుడే లేడని టాక్ నడుస్తోంది. అఖండతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ప్రగ్యా.. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రగ్యా జైస్వాల్‌కు అవకాశాలు కరువయ్యాయని, హిట్టు పడినా పాపం ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.