Begin typing your search above and press return to search.

కొత్త యాంగిల్ లో ట్వీట్ చేసిన పెద్ద కళ్ల బ్యూటీ

By:  Tupaki Desk   |   22 March 2020 6:50 AM GMT
కొత్త యాంగిల్ లో ట్వీట్ చేసిన పెద్ద కళ్ల బ్యూటీ
X
గతంలో ఎప్పుడూ లేని రీతిలో సెలబ్రిటీలు..సినీ నటులకు మస్తు ఖాళీ దొరికింది. చేసే పనిలో కాస్త విరామం దొరికింతనే నచ్చిన ప్లేస్ కు వెళ్లిపోవటం.. అలవాటైన సెలబ్రిటీలకు కరోనా పుణ్యమా అని ఇల్లే లోకంగా మారిపోయింది. కొన్నేళ్లుగా అలవాటైన లైఫ్ స్టైల్ కు భిన్నంగా జీవనచిత్రం ఇప్పుడు అలవాటైంది. ఈ కారణంతో కావొచ్చు.. గతంతో పోలిస్తే.. ఏ మాత్రం అవకాశం వచ్చినా.. సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టేస్తున్నారు. గతంలో ఏదైనా అంశంపైన ఆచితూచి అన్నట్లు పోస్టులు పెట్టేశారు.

వివాదాలకు.. పెద్ద చర్చలకు అవకాశం ఉండే పోస్టుల్ని పెట్టకుండా జాగ్రత్తలు తీసుకునే వారు. కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రం అందుకు మినహాయింపుగా ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెర మీదకు వస్తున్న పలు అంశాల్ని ప్రస్తావిస్తూ పోస్టు చేస్తున్న వైనం కొత్త చర్చకు తెర తీసేలా ఉంది. తాజాగా అలాంటి పనే చేశారు పెద్దకళ్ల బ్యూటీ ప్రణీత. అందం.. అభినయంతో పాటు.. పాత్ర కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా ఉండే ఈ భామకు తెలుగులో సినిమాలు లేవు. నమ్మకున్న కన్నడలో కూడా తన స్థానం కోసం కిందామీదా పడుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రణీత తాజాగా చేసిన ఒక పోస్టు అందరిని ఆకర్షిస్తోంది. కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇప్పటివరకూ పలువురు సెలబ్రిటీలు పోస్టు చేసిన దానికి భిన్నంగా ప్రణీత పోస్టు ఉందని చెప్పాలి. హిందువలు రెండు చేతులతో నమస్కరించటాన్ని ఇతరులు నవ్వుకున్నారని.. బయట నుంచి వచ్చి ఇళ్లల్లోకి వెళ్లేటప్పుడు చేతులు.. కాళ్లు కడుక్కోవటం చూసి నవ్వుకునే వారని.. జంతువుల్ని పూజించటం చూసి నవ్వేవారని.. కానీ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారన్నారు.

మొక్కలకు.. వనాలకు ప్రణమిల్లటం.. శాఖాహారాన్ని తినటం.. యోగా చేయటం.. మరణించిన వారి భౌతికకాయాల్ని దహనం చేయటం..అంత్యక్రియల తర్వాత తలారా స్నానం చేయటాన్ని చూసి నవ్వేవారని.. ఇప్పుడు మాత్రం ఎవరూ నమ్మటం లేదని.. అందుకు బదులుగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తిని మనం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న అలవాట్లనుఫాలో అయిపోతే సరిపోతుందన్నారు. ఇంతకీ .. ప్రణీత పెట్టిన పోస్టు ఎవరిని టార్గెట్ చేసినట్లు? ప్రాశ్చాత్యదేశస్తులతో పాటు.. హిందూయేతరులను కదిలించినట్లుగా ఉన్న ఈ పోస్టు పుణ్యమా అని రానున్న రోజుల్లో మరింత చర్చకు అవకాశం ఉందని చెప్పక తప్పదు.