Begin typing your search above and press return to search.
హీరోయిన్ రాధ వివాదాల్లో ఇన్ని ట్విస్టులా..?
By: Tupaki Desk | 23 Aug 2016 10:23 AM GMTకొంతమంది సినిమా నటులు వివాదాల్లో చిక్కుకుంటారు. కానీ, ఆ వివాదాల్లో ఇన్ని ట్విస్టులు ఉంటాయని మాత్రం ఎవ్వరూ ఊహంచరు. సుందర్ ట్రావెల్స్ అనే తమిళ చిత్రంలో నటించిన రాధ మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని - రక్షణ కల్పించాలని చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వైరం అనే ఒక రౌడీ షీటర్ తనను పంచేస్తా అని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఆ బెదిరింపు ఫోన్ కాల్ ఆడియో టేపును కూడా పోలీసులకు ఇచ్చింది. చెన్నై పుళల్ జైల్లో ఉన్న వైరం తనకు ఫోన్ చేశాడనీ - చంపేస్తా అంటున్నాడని రాధ ఫిర్యాదులో పేర్కొంది.
అయితే, జైల్లో ఉన్న వైరం సెల్ ఫోన్ లో మాట్లాడే అవకాశం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. రౌడీ షీటర్ వైరం గడచిన రెండేళ్లుగా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఓ డజను ఇతర కేసులు - రెండు మర్డర్ అటెంప్ట్ కేసులు కూడా వైరం మీద ఉన్నాయి. దాంతో జైల్లో ఉన్నాడు. అతడే తనకు ఫోన్ చేసి బెదిరించాడని ఆరోపణ! అయితే, రాధపై అనూహ్యంగా వైరం భార్య ఫిర్యాదు చేసింది. తన భర్తపై తప్పుడు కేసులు బనాయిస్తోందని వైరం భార్య లీనా అంటోంది. రాధను బెదిరించాల్సిన అవసరం తన భర్తకు లేదని, అతడి పేరుతో ఎవరో ఫోన్ చేసి ఉంటారని ఆమె మీడియాతో చెబుతోంది. ఇదిలా ఉంటే, నటి రాధ వల్లనే తన భర్త తనని వదిలేసి వెళ్లిపోయాడని ఉమాదేవి అని మరో మహిళ పోలీసులును ఆశ్రయించడం ఇంకో ట్విస్ట్!
ఏఐడీఎంకే కార్యకర్త మునివేల్ భార్య ఈ ఉమాదేవి! తన భర్తతో రాధ సన్నిహితంగా ఉంటోందని, అందుకే తనను మునివేల్ పట్టించుకోవడం లేదని ఆమె గతంలో విరుంగంబక్కాం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు ఉమాదేవి చెప్పింది. తరువాత, రాధనీ తన భర్తనీ పిలిచి పోలీసులు వార్నింగ్ ఇచ్చారని ఆమె చెబుతోంది. అయినాసరే రాధ తీరు మారలేదనీ, తన భర్తకు ఫోన్లు చేస్తూనే ఉందని ఉమాదేవి అంటోంది. కొన్నిసార్లు తనకీ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గడచిన రెండు రోజులుగా తన భర్త కనిపించం లేదనీ, దానికి నటి రాధ కారణం అయి ఉండొచ్చని ఉమాదేవి అభిప్రాయపడుతోంది. తన భర్త మిస్సింగ్ కు రాధ కారణమని ఆమె అంటున్నారు. ఈ కేసు విషయమై ఒకట్రెండు రోజుల్లో రాధను పోలీసులు విచారించే అవకాశం ఉంది.
తాజా కేసులు ఇలా ఉంటే... కొన్నాళ్ల కిందట తనను ఒక వ్యాపారవేత్త మోసం చేశాడని రాధ ఆరోపించింది. పోలీసులను కూడా ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కేసుపెట్టింది. సో.... ఒకేసారి ఇన్ని వివాదాలు రాధ చుట్టూ ముసురుకున్నాయి మరి!