Begin typing your search above and press return to search.

లైంగిక అవ‌య‌వం గుండె లేదా మెద‌డు లాంటిది!

By:  Tupaki Desk   |   10 Oct 2022 3:20 PM GMT
లైంగిక అవ‌య‌వం గుండె లేదా మెద‌డు లాంటిది!
X
క‌థ‌ల విష‌యంలో ప్ర‌యోగం చేయాలంటే బాలీవుడ్ యువ‌హీరో ఆయుష్మాన్ ఖురానా త‌ర్వాతే. విక్కీ డోన‌ర్ మొద‌లు నేటి రిలీజ్ డాక్ట‌ర్ జి వ‌ర‌కూ అత‌డు ఎంచుకున్న దారి వేరు. ఇప్పుడు మేల్ గైన‌కాల‌జిస్ట్ పాత్ర‌లో అత‌డు మ‌రో ప్ర‌యోగం చేసాడు. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌. ప్ర‌స్తుతం టీమ్ ప్ర‌చారంలో బిజీబిజీగా ఉంది. ఓ ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

డాక్టర్ జి మూవీ ప్రారంభం నుండి హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఈ సినిమా కాస్టింగ్ కథాంశం స‌హా ప్ర‌తిదీ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ముఖ్యంగా దాని కథ లో మ్యాట‌ర్ ప్ర‌తిసారీ చ‌ర్చ‌కు వస్తోంది. భారతదేశంలో మగ గైనకాలజిస్ట్ పాట్లు ఎలా ఉంటాయ‌నేదే ఈ సినిమా కాన్సెప్టు. ఇది ఒక ర‌కంగా యుక్త‌వ‌య‌స్కుల లోగుట్టును ధైర్యంగా వివ‌రించే ప్రయత్నం.

ఆయుష్మాన్ ఖురానా- ర‌కుల్ జంట‌గా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అందాల క‌థానాయిక‌ రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ .. యుక్తవయసులో మగ గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లడానికి `సిగ్గుపడ్డట్లు` వెల్లడించింది.

తాజా ఇంటర్వ్యూలో ర‌కుల్ మాట్లాడుతూ-``ఒకప్పుడు నేను మగ గైనకాలజిస్ట్ ను క‌లిసేందుకు వెళ్లాను. ఆరోజు నేను చాలా సిగ్గుపడ్డాను. ఈ వ్యక్తి నన్ను పరీక్షించడానికి ఎలా అనుమతించాలి? అని నేను అనుకున్నాను? 13-14 ఏళ్ల వయస్సు లో అలా సిగ్గుపడ్డాను!`` అని వెల్ల‌డించింది.

కానీ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే .. నేను పెద్దయ్యాక అదే విష‌యాన్ని ఎలా ఆలోచిస్తామో సంగ్రహించాను అని తెలిపారు. డాక్ట‌ర్ జి ట్రైలర్ లో కూడా అదే సంభాషణ ఉంటుంది. మేము మగ స్పర్శ గురించి... వైద్యుని స్పర్శ గురించి డిఫ‌రెన్సు ఏమిట‌న్న‌ది ఇందులో చెబుతున్నామ‌ని కూడా ర‌కుల్ అంది. గణాంకాల ప్రకారం దేశంలోని అగ్రశ్రేణి గైనకాలజిస్ట్ లలో కొందరు పురుషులు ఉన్నార‌ని తెలిపారు.

మరింత వివరిస్తూ... ``కాబట్టి మేము చెప్పదలుచుకున్నది అదే - ఒక వైద్యుడిని వైద్యుడిగానే చూడాలి. లైంగిక ఆరోగ్యం ఒక వ్యక్తి లేదా జీవిలో చాలా ముఖ్యమైన భాగం కాబట్టి ఆ అంశం చుట్టూ ఉన్న నిషేధపు ఆలోచ‌న‌ల‌ను విచ్ఛిన్నం చేయాలి. దురదృష్టవశాత్తు మ‌న‌మంతా దాని గురించి ఎక్కువగా మాట్లాడము. కానీ అది గుండె లేదా మెదడు త‌ర‌హాలో మ‌న శరీరంలోని ఒక భాగం....!! అని ర‌కుల్ అన్నారు. ఈ చిత్రంలో షెఫాలీ షా కూడా కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 14న సినిమాను విడుదల చేయనున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.