Begin typing your search above and press return to search.

'కళ్ళాజోడు కాలేజి పాప' రేంజ్ లో రకుల్

By:  Tupaki Desk   |   26 July 2022 1:30 AM GMT
కళ్ళాజోడు కాలేజి పాప రేంజ్ లో రకుల్
X
బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అయితే బాగానే అందుకుంటుంది. మొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో బిజీగా కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం నార్త్ సినిమా ఇండస్ట్రీలోనే చాలా హ్యాపీగా సినిమాలు చేసుకుంటోంది. ఇక ఈ బ్యూటీ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటాయి.

రీసెంట్గా పెద్దగా గ్లామర్ డోస్ లేకపోయినా కూడా ఒక స్టైలిష్ ఫోటోతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సాధారణంగా రకుల్ ఒకరోజు గ్లామర్ ఫోటోలను మరొక రోజు సింపుల్ గా ఉండే లైఫ్ స్టైల్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ప్రతి ఫోటో కూడా వైరల్ అయిపోవాలని ఆమె కోరుకోదు కానీ ఆమె ఫాలోవర్స్ మాత్రం ఆ ఫోటోలను వైరల్ అయ్యేవరకు వదిలిపెట్టే ఇలా ఉండడం లేదు.

ఇక రీసెంట్ గానే పోస్ట్ చేసిన ఒక ఫోటో కూడా చాలా బాగానే అట్రాక్ట్ చేస్తోంది. ఇక రకుల్ తెలుగు ఫ్యాన్స్ అయితే ఆమె ముద్దుగా చాలా అద్భుతంగా ఉంది అని చెబుతున్నారు.

ముఖ్యంగా కళ్ళజోడు కాలేజీ పాపా రేంజ్ లో ఉంది అని కూడా వివరణ ఇస్తూ ఉండడం విశేషం. కూలింగ్ సన్ గ్లాసెస్ తో రకుల్ కాస్త క్లివేజ్ షోను తగిలించి సరికొత్త డ్రెస్సులో దర్శనం ఇచ్చిన విధానం హైలెట్ గా నిలిచింది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో చివరగా ఆమె కొండపొలం, చెక్ అనే సినిమాలు చేసింది. దురదృష్టవశాత్తు ఆ రెండు మంచి సినిమాలు అనుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆమె మరొక రెండు తెలుగు సినిమాలు చేసేందుకు చర్చలు అయితే జరుపుతోంది. అలాగే మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో అజయ్ దేవగన్ తో మరొక సినిమా చేస్తోంది. అంతేకాకుండా నార్త్ లోనే మరో మూడు ప్రాజెక్టులలో కూడా ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.