Begin typing your search above and press return to search.

వీడియో: కూల్ గా ఉండ‌క ర‌కుల్ ఏంటీ పాట్లు?

By:  Tupaki Desk   |   13 Jan 2023 2:30 AM GMT
వీడియో: కూల్ గా ఉండ‌క ర‌కుల్ ఏంటీ పాట్లు?
X
పేరులో ఉన్న కూల్ నెస్ చేసే ప‌నుల్లోను ఉండాలి! కానీ ర‌కుల్ కూల్ యాటిట్యూడ్ ని కోల్పోతోంది. ఇటీవ‌లి కాలంలో మైన‌స్ డిగ్రీల చ‌లిలోను వేడి పుట్టించే గ్లామ‌రస్ లుక్ తో క‌వ్విస్తోంది. వ‌రుసగా సోష‌ల్ మీడియా ఫోటోషూట్లతో విరుచుకుప‌డుతోంది. వీటిలో ర‌కుల్ అందాల ఆర‌బోతలో హ‌ద్దు మీరుతోంది. నిజానికి నేటిత‌రం ధాటిని త‌ట్టుకోవ‌డం అంత వీజీ కాద‌ని గ్ర‌హించిన చాలామంది సీనియ‌ర్ భామ‌లు ఇదే పంథాను అనుస‌రిస్తున్నారు. ర‌కుల్ అందుకు మిన‌హాయింపు కాదు.

ఓవైపు సినిమాలు.. మ‌రోవైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు తీరిక లేకుండా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నా ర‌కుల్ ఇంకా ఏదో సాధించాల‌ని త‌పిస్తోంది. తాజాగా ఈదురు గాలిలో ఇలా గొడుగుతో నానా పాట్లు ప‌డుతూ క‌నిపించింది. కానీ ఈ పాట్లు అన్నీ సంపాద‌న కోస‌మేన‌ని అర్థం చేసుకోవాలి. ఛ‌త్రి కో సంభాలో అంటూ ఫోటోగ్రాఫ‌ర్లు త‌న వెంట‌ప‌డుతుంటే ర‌కుల్ అలా గొడుగు ప‌ట్టుకుని ఫోజులిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ర‌కుల్ న‌టించిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమా `ఛ‌త్రివాలి` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇటీవ‌లే ట్రైలర్ ను మేక‌ర్స్ ఆవిష్కరించారు. సురక్షితమైన సెక్స్ .. సెక్స్ ఎడ్యుకేషన్ పై యూత్ కి సందేశం అందించే చిత్ర‌మిది. అయితే దీనిని క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌పై చ‌ర్చిస్తారు. ఇందులో ర‌కుల్ పాత్ర ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంది.

నేటి పితృస్వామ్య సమాజంలో అన్ని అసమానతలు సామాజిక నిబంధనలు అడ్డంకులకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడే ధైర్య‌శాలి అయిన‌ సన్యాసి ప్రతి ఇంటికి అవసరం. ఈ పాత్ర ర‌క్ష‌ణ లేని వారిని అసుర‌క్షిత విధానాల‌తో ఉండేవారిని ప్రేరేపిస్తుందని నేను ఆశిస్తున్నాను. సెక్స్ విష‌యంలో సుర‌క్షిత విధానాల‌ను ఉపయోగించకపోవడం వల్ల కలిగే అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల గురించి నా పాత్ర వివ‌రిస్తుంది..అని ర‌కుల్ వెల్ల‌డించింది. మానసిక శారీరక ఆరోగ్యం.. లైంగిక ఆరోగ్యం..వెల్ నెస్ గురించి చ‌ర్చించ‌డం నేటి స‌మాజానికి యువ‌త‌రానికి అవ‌స‌ర‌మ‌ని ర‌కుల్ తాజా ఇంట‌ర్వ్యూలో పేర్కొంది.

ఈ చిత్రం s*x విద్య ప్రాముఖ్యతను - తాదాత్మ్యం పై భావి తరాలకు అవగాహన పెంచడం ఎలా అనే దానిపైనా చ‌ర్చిస్తుంది. క‌థాంశం బోల్డ్ గా అనిపించినా కానీ.. ఓవ‌రాల్ గా బోల్డ్ నెస్ ఎలివేట్ అవ్వ‌దు. ఎంచుకున్న‌ టాపిక్ కూడా చాలా సాధారణమైనది. నిజానికి మనం ఏదైనా కీలకమైన అంశం గురించి మాట్లాడితే ఆస‌క్తిగా ఉంటాం. ఆరోగ్యం- మానసిక ఆరోగ్యం- భావోద్వేగ ఆరోగ్యం అన్నీ బావుంటేనే లైంగిక ఆరోగ్యం సాధ్య‌మ‌వుతుంది. ఇది ఒక ఎంపిక కాదు. తప్పనిసరి అవ‌స‌రం! ఈ విష‌యం మీ అంద‌రికీ తెలిసిన‌దేన‌ని ర‌కుల్ పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.