Begin typing your search above and press return to search.
ఏదీ దాచను.. పెళ్లిపై స్పందించిన రకుల్
By: Tupaki Desk | 16 Oct 2022 9:43 AM GMTరకుల్ ప్రీత్ సింగ్ తాజా చిత్రం `డాక్టర్ జి` శుక్రవారం నాడు థియేటర్లలోకి వచ్చింది. సినిమాకి మిశ్రమ స్పందనలు వచ్చినా రకుల్ నటనకు పేరొచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు ప్రేక్షకుల నుండి ప్రేమ సందేశాలు ప్రశంసలను అందుకుంది. తన నటనపై వస్తున్న సమీక్షలతో రకుల్ ఆనందంలో ఉంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో అదే విషయాన్ని వ్యక్తం చేసింది.
డాక్టర్ గా రకుల్ నిజాయితీగా నటించి మెప్పించింది. మొదటిసారి ఆయుష్మాన్ ఖురానాతో జంటగా నటించడం ప్రేక్షకులు అభిమానులను మెప్పించింది. సోషల్ మీడియా ద్వారా రకుల్ తన అభిమానులకు విపరీతమైన ప్రశంసలు కురిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ``ఆప్కే ప్యార్ సే హుమారా దిల్ ధక్ ధక్ కర్ రహా హై`` అని చెప్పింది. అనుభూతి కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జంగ్లీ పిక్చర్స్ సమర్పణలో తెరకెక్కింది. ఈ చిత్రంలో షెఫాలీ షా -షీబా చద్దా తదితరులు నటించారు.
పెళ్లి వార్తలపై స్పందన ఇదీ...!
తాజాగా డాక్టర్ జి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై వస్తున్న వార్తలకు రకుల్ స్పందించింది. గత ఏడాది నవంబర్ లో బాలీవుడ్ నటులు జాకీ భగ్నానీ- రకుల్ ప్రీత్ సింగ్ తమ సంబంధాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి ఈ జంట చాలా సందర్భాలలో కలిసి కనిపించింది. ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకుంటున్నట్టు కథనాలొస్తున్నాయి.
ఈ వార్తలకు ప్రతిస్పందనగా రకుల్ ఒక ట్వీట్ ను పోస్ట్ చేసింది. ఇప్పటికిప్పుడే తన పెళ్లి జరుగుతుందనే ఆలోచన తమకు లేదని చమత్కరించింది. జాకీ -రకుల్ 2023లో వివాహం చేసుకోబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తన సోదరి వివాహ ప్రణాళికల గురించి ఇటీవల బహిరంగంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ``'జాకీ భగ్నాని దర్శకత్వంలో రకుల్ రెండు సినిమాల్లో నటించింది. వివాహం స్పష్టంగా కార్డులపై ఉంది. కానీ ఇంకా ఏదీ తుది నిర్ణయం తీసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె స్వయంగా ఆ విషయాన్ని ప్రకటిస్తుంది. అది జరుగుతుందో లేదో నాకు తెలుసు. ఏ సంబంధానికైనా వివాహం క్లైమాక్స్. జాకీ భారతీయ సినిమా అగ్ర నిర్మాతలలో ఒకరు. అతని మనస్సులో చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వాస్తవానికి, వారిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి వారికి భారీ లక్ష్యాలు ఉన్నాయి`` అని తెలిపారు.
అతని వ్యాఖ్యలతో పుకార్లు ఊపందుకున్న తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ దానిపై స్పందించింది. తాజా ట్వీట్ లో తన సోదరుని ప్రస్థావిస్తూ మీరు ధృవీకరించారా ? నా జీవితం పై ఎలాంటి వార్తలు లేవని సరదాగా ఉంది.. అని వ్యాఖ్యానించింది. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో రకుల్ వ్యాఖ్యానిస్తూ .. మా అనుబంధాన్ని బహిరంగంగానే చెప్పాం. పెళ్లి గురించి కొందరు దాచాలనుకుంటారు. కానీ మేం అలా ఆలోచించలేదు. సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి అందరికీ చెబుతామని కూడా రకుల్ అంది. రిలేషన్ షిప్ ని దాచే ఆలోచన లేక బహిరంగంగా అంగీకరించామని కూడా తెలిపింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... రకుల్ తదుపరి `థ్యాంక్ గాడ్`లో నటించనుంది. ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటిస్తుంది. అజయ్ దేవగన్- సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో ఇతర తారాగణం. `ఛత్రివాలి` అనే టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఆమె నటించనుంది.