Begin typing your search above and press return to search.

రగ్గుడ్ లుక్ లో రామ్.. ఈ మాసివ్ మేకోవర్ బోయపాటి కోసమేనా..?

By:  Tupaki Desk   |   9 Sep 2022 11:30 PM GMT
రగ్గుడ్ లుక్ లో రామ్.. ఈ మాసివ్ మేకోవర్ బోయపాటి కోసమేనా..?
X
ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవల 'ది వారియర్' సినిమాతో ప్లాప్ అందుకున్నాడు. ఈ సినిమాతో కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలనుకున్న రాపో కి నిరాశే ఎదురైంది. దీంతో తన తదుపరి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని డిసైడైన యంగ్ ఎనర్జిటిక్ హీరో.. ఈసారి పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇది దర్శక హీరోల కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అలానే బోయపాటి కెరీర్ లో 10వ చిత్రం.. రామ్ కు 20వ సినిమా. ఊర మాస్ డైరెక్టర్ కు రామ్ ఎనర్జీ తోడైతే #BOTAPATIRAPO మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇకపోతే RAPO20 కోసం రామ్ మేకోవర్‌ అవుతున్నాడని అర్థమవుతుంది. లేటెస్టుగా రాపో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రాపో గుబురు గడ్డం మరియు పొడవాటి జుట్టుతో రగ్గుడ్ లుక్ లో రాకింగ్ గా కనిపిస్తున్నారు.

బోయపాటి సినిమా కోసం కావలసిన ట్రాన్స్ఫర్మేషన్ సాధించడానికి రామ్ కొంత బరువును పెంచుకున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రింటెడ్ బ్లాక్ షర్ట్ మరియు బ్లూ జీన్స్ లో ఏవియేటర్ సన్ గ్లాసెస్‌ పెట్టుకుని చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు.

హిందీ డబ్బింగ్ చిత్రాలతో నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పరచుకున్నారు రామ్. అతను నటించిన ప్రతీ సినిమా కూడా హిందీలోకి డబ్ కాబడి యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకుంటాయి. మరోవైపు బోయపాటి శ్రీను సినిమాలు కూడా నార్త్ ఇండియన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయబోయే పవర్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ మూవీ.. కచ్చితంగా బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

RAPO20 సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివర్లో ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సినిమాలో నటించే నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

ఇది కాకుండా దర్శకుడు హరీష్ శంకర్‌ తో కలిసి రామ్ పోతినేని ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయం మీద దర్శక హీరోల నుంచి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. చాలా కాలం క్రితమే వీరి మధ్య ఓ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరగ్గా.. త్వరలోనే తమ కాంబోలో మూవీ ఉంటుందని దర్శకుడు స్వయంగా వెల్లడించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.