Begin typing your search above and press return to search.

చీరందంలో నీలాంబ‌రి సొగ‌బులు

By:  Tupaki Desk   |   26 Jun 2023 7:00 AM GMT
చీరందంలో నీలాంబ‌రి సొగ‌బులు
X
వెట‌ర‌న్ న‌టీమ‌ణుల్లో ర‌మ్య‌కృష్ణ స‌మ్ థింగ్ స్పెష‌ల్.రేర్ గా సోష‌ల్ మీడియాలో ర‌మ్య‌కృష్ణ ఫోజులు ఆమెని సీనియ‌ర్ భామ‌ల నుంచి వేరు చేస్తుంటాయి. న‌వ‌త‌రం నాయిక‌లకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంటారు. తాజాగా ర‌మ్య‌కృష్ణ సంప్ర‌దాయ చీరందంలో త‌ళుక్కున మెరిసారు. ఇదిగో ఇక్క‌డిలో షోల్డ‌ర్ లెస్ డిజైన్డ్ బ్లైజ్ లో గ్రీన్ క‌ల‌ర్ సారీలో వావ్ అనిపిస్తున్నారు.

ఆమె ఎంపిక చేసుకున్న‌ మ్యాచింగ్ ఎక్స‌ర‌సీస్..పెదాల‌పై స‌న్న‌ని న‌వ్వు...క‌ళ్ల‌లో భావాలు..స్కిన్ టోన్ ర‌మ్య‌కృష్ణ‌ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తున్నా యి. 50 ఏళ్లు పై బ‌డిన అదే అందంతో ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఆమె అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. సీనియ‌ర్ బ్యూటీ ఇలా చీరందంలో మెర‌వ‌డం కొత్తేం కాదు.

ఇన్ స్టా ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దాయ దుస్తుల్లో మెరుస్తుంటారు. ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపో తున్నారంటే? ఇలాంటి ఎలివేష‌న్లు కూడా కొంత‌వ‌ర‌కూ క‌లిసొస్తున్నాయ‌నొచ్చు. ప్ర‌తిభ ఒక్క‌టే స‌రిపోదు. అప్పుడ‌ప్పుడు ఇలా ట‌చ్ లో ఉంటేనే? అవ‌కాశాలు వ‌స్తాయ‌ని త‌న సీక్రెట్ ని ఇలా రివీల్ చేస్తున్నారు. ఇటీవ‌లే రంగ‌మార్తాండ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌తో మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

ఈ పాత్ర ఆమెకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. అంత‌కు ముందు `లైగ‌ర్`..` బంగార్రాజు` ..`రొమాంటిక్` చిత్రాల్లో మామ్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. 50 ఏ ళ్లు పైబ‌డిన న‌టి ఇంకా తెలుగు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారంటే? అదంగా ఆమె గొప్ప‌త‌న‌మే. త‌న‌కోసం అంటూ ద‌ర్శ‌కులు కొన్ని పాత్ర‌లు సృష్టిస్తున్నారు. వాటిని తెలివిగా ప్ర‌తిభ‌తో స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.

ర‌మ్య‌కృష్ణ త‌రం హీరోయిన్లు చాలా మంది రిటైర్మెంట్ త‌ర్వాత వేర్వేరు రంగాల్లో స్థిర‌ప‌డ్డారు. కానీ నీలాంబ‌రి మాత్రం నాగార్జున లాంటి హీరోకి అప్పుడ‌ప్పుడు భార్య పాత్ర‌లు పోషిస్తున్నారంటే? అందంతా ట్యాలెంట్ తోనే సాద్య‌మ‌నాలి. అంత‌కు ముందు `బాహుబ‌లి`లో శివ‌గామి పాత్ర‌తో పాన్ ఇండియ‌నే షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న గుంటూరు కారంలో న‌టిస్తున్నారు.