Begin typing your search above and press return to search.
జనాలు నన్ను గుర్తు పట్టడం లేదు
By: Tupaki Desk | 11 Oct 2021 11:40 AM GMTపాతికేళ్ల క్రితం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న పెళ్లి సందడి సినిమాను మళ్లీ గుర్తు చేసే విధంగా పెళ్లిసందD సినిమాను తీసుకు రాబోతున్నారు. ఆ పెళ్లి సందడికి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.. కాని ఈసారి మాత్రం ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆ పెళ్లి సందడిలో హీరోగా శ్రీకాంత్ నటించగా ఈసారి ఆయన తనయుడు రోషన్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెళ్లిసందD సినిమా ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆ వేడుకలో చిరంజీవి.. వెంకటేష్ లు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఇక పాతికేళ క్రితం వచ్చిన పెళ్లి సందడి టీమ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆ సినిమాలో శ్రీకాంత్ కు జోడీగా నటించిన ఇద్దరు హీరోయిన్స్ ను ఈ వేడుకకు రాఘవేంద్ర రావు ఆహ్వానించడం జరిగింది. దీప్తీ భట్నాగర్ మరియు రవళిలు చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
దీప్తీ భట్నాగర్ లుక్ పరంగా పెద్దగా మార్పు లేదు. కాని రవళి మాత్రం చాలా మారారు. ఆమె వెయిట్ ఎక్కువ అయ్యారు. ఆమె గుర్తించలేనంగా మారారు. ఆమె మాట్లాడుతూ చిరంజీవి మరియు వెంకటేష్ లకు తనను తాను పరిచయం చేసుకున్నారు. రవళిని చూసిన వెంటనే ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అవాక్కయ్యారు. చాలా మంది ఆమెను గుర్తించలేదు. దాంతో ఆమె మాట్లాడుతూ నేను రవళి అని పరిచయం చేసుకున్నారు. ఆమె పరిచయం చేసుకున్న తర్వాత ఆమెను చాలా మంది గుర్తు పట్టి అవాక్కయ్యారు. జనాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవలి చాలా కాలం తర్వాత జనాల ముందుకు రావడం జరిగింది. ఈ విషయమై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నేను ఈమద్య కాలంలో ఇలాంటి సినీ వేడుకలకు హాజరు కాలేదు. రావద్దు అని కాదు కాని నన్ను ఇప్పుడు జనాలు గుర్తిస్తారో లేదో అని రావడం లేదు. రాఘవేంద్ర రావు గారు ఆహ్వానించడంతో వచ్చేశాను. ఆయన ఆహ్వానిస్తే ఎలా ఉన్నా వచ్చేందుకు నేను రెడీగా ఉన్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో రవళి ఎంతో అందంగా కనిపించింది. 1990 ల్లో ఆమె అందానికి ఫిదా అయిన అభిమానులు లక్షల్లో ఉండే వారు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. హాట్ సన్నివేశాల్లో కూడా ఆమె నటించి అప్పటి కుర్ర కారును ఉర్రూతలూగించింది. అలాంటి రవళి ఇలా అయ్యిందే అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రవళి లావు తగ్గి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు.