Begin typing your search above and press return to search.

అందాల రెజీనా.. కళ్ళు దానం చేసేసింది

By:  Tupaki Desk   |   10 Aug 2016 11:05 AM GMT
అందాల రెజీనా.. కళ్ళు దానం చేసేసింది
X
టాలీవుడ్ సుందరాంగి రెజీనా కెరీర్ ఇప్పుడు బాగానే ఉంది కానీ.. గొప్పగా మాత్రం లేదు. చేతిలో సినిమాలు చాలానే ఉన్నా.. స్టార్ వాల్యూ ఉన్న సినిమా మాత్రం లేదు. కృష్ణవంశీతో చేస్తున్న నక్షత్రం ఒక్కటే.. పెద్ద డైరెక్టర్ తో చేస్తున్న సినిమా. తోటి పోటీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దూసుకుపోతుంటే ఆ వేగాన్ని అందుకోలేకపోతున్న రెజీనా.. ఓ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను ఫాలో అయిపోతోంది.

రీసెంట్ గా నెల్లూరులో ఓ కంటి ఆస్పత్రి ప్రారంభానికి అటెండ్ అయింది రెజీనా. ఆ కార్యక్రమంలోనే.. తన రెండు కళ్లను దానం చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలకు సైన్ చేసి ఇచ్చేసింది. అవి దానం చేయాలి.. ఇవి దానం చేయడం అని చెప్పడమే కాకుండా.. పిలవగానే తనే స్వయంగా వచ్చి, తనే డొనేట్ చేయడాన్ని గుర్తుంచుకోవాలి. అంతే కాదు ఆ ఆస్పత్రి మొత్తం తిరిగేసి.. అక్కడి పరిస్థితుల గురించి తెలిసేసుకుంది కూడా.

ఇప్పటికే కాజల్.. సమంతలు కూడా తమ నేత్రాలను దానం చేశారు. ఇప్పుడు రెజీనా కూడా ఈ రూట్ లో జాయిన్ అయిపోయింది. మంచితనం బాగానే ఉంది కానీ.. సినిమాల్లో సత్తా చాటేందుకు అవసమరైన అందం.. ట్యాలెంట్. ఆకర్షణ అన్నీ ఉన్నా రెజీనా కసాండ్రాకి ఆఫర్స్ అంతగా రాకపోవడం ఆలోచించాల్సిన విషయమే కదూ.