Begin typing your search above and press return to search.

న‌ల్ల కోక‌లో జిల్ల‌నిపించిన `గురు` బ్యూటీ

By:  Tupaki Desk   |   19 July 2022 2:30 AM GMT
న‌ల్ల కోక‌లో జిల్ల‌నిపించిన `గురు` బ్యూటీ
X
విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన `గురు` చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైంది రితికా సింగ్. పాత్ర స్వ‌భావానికి త‌గ్గ‌ట్టు రితిక మాస్ అప్పీల్ ర‌ఫ్ నేచుర్ ఆ మూవీకి పెద్ద ప్ల‌స్ అయ్యాయి. న‌టిగా మంచి మార్కులే వేసారు క్రిటిక్స్.

కానీ ఎందుక‌నో రితిక తెలుగు సినీపరిశ్ర‌మ‌లో క్లిక్ కాలేదు. ప్ర‌స్తుతానికి త‌మిళంలోనే అడ‌పాద‌డ‌పా న‌టిస్తోంది. ఏడాది కాలంగా ఆశించినంత పెద్ద అవ‌కాశాల్ని అయితే అందుకోలేదు.

అయితే ఇత‌ర నాయిక‌ల‌కు ధీటుగా సోషల్ మీడియాలో కొన్ని టీజింగ్ వీడియోలు ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల్ని ఆట‌ప‌ట్టిస్తోంది. ఇన్ స్టాలో నిరంత‌రం వేడి పెంచే కంటెంట్ ని పుల్ చేస్తోంది.

తాజా వీడియోలలో ఒకదానిలో రితికా బ్లాక్ శారీలో జిల్ అనిపించింది! 30 సెక‌న్ల పాటు ఆ వీడియో ఎంతో మ‌నోహ‌రంగా ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారుతోంది.

రితికా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఈ సంవత్సరం తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది. ఏడాది కాలంగా కెరీర్ ప‌రంగా స్లోగా ఉన్నా.. పెద్ద హిట్టు కొట్టి రేస్ లో తానేమీ త‌క్కువ కాద‌ని నిరూపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. బిచ్చ‌గాడు ఫేం విజ‌య్ ఆంటోని తో క‌లిసి ఈ బ్యూటీ ఓ చిత్రంలో న‌టిస్తోంది. ఈ మూవీ లుక్ ఇంత‌కుముందు విడుదలైంది. అందులో రితిక ఎంతో గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తోంది.