Begin typing your search above and press return to search.

`డ‌ర్టీ హ‌రి` భామ క్లాసీ లుక్ వైర‌ల్

By:  Tupaki Desk   |   28 Aug 2022 1:30 AM GMT
`డ‌ర్టీ హ‌రి` భామ క్లాసీ లుక్ వైర‌ల్
X
హిమ‌చ‌ల్ బ్యూటీ రుహానీ శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. చి.ల‌.సౌ చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశించింది. సుశాంత్ స‌ర‌స‌న నాయిక‌గా త‌న‌దైన ఆహార్యంతో ఆక‌ట్టుకుంది.

ఆ త‌ర్వాత `డ‌ర్టీ హ‌రి` లాంటి బోల్డ్ మూవీతో మ‌రింత పాపులారిటీ పెంచుకుంది. అగ్ర‌నిర్మాత కం ద‌ర్శ‌కుడు ఎం.ఎస్.రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిట్ - ది ఫ‌స్ట్ కేస్ చిత్రంలోనూ అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. తెలుగు త‌మిళంలోనూ బిజీ నాయిక‌గా అవ‌కాశాలు అందుకుంటోంది.

ఇటీవ‌ల‌ ఇన్ స్టా వేదిక‌గా వేడెక్కించే ఫోటోల‌ను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తున్న రుహానీ భారీ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. తాజాగా మ‌రో హాట్ ఫోటో షూట్ ని రుహానీ షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

రుహానీ క్రీమ్ వైట్ టాప్ లో అందంగా క‌నిపిస్తున్న ఫోటో యువ‌త‌రాన్ని ఆక‌ర్షిస్తోంది. అంత‌కుముందే రుహానీ శారీ లుక్ లో హాటెస్ట్ ఫోటోషూట్ అంతే వైర‌ల్ గా మారింది. క్రీమ్ .. పింక్ క‌ల‌ర్.. బ్రౌన్ క‌ల‌ర్ డ్రెస్ కోడ్ తో రుహానీ వ‌రుస ఫోటోషూట్లు ఇన్ స్టాలో వేడెక్కిస్తున్నాయి.

పక్కింటి అమ్మాయిగా న‌టిస్తూనే గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు స‌రిపోయే లుక్ రుహానీ సొంతం. ప్ర‌స్తుతం తెలుగులో ఓ పెద్ద హీరో స‌ర‌స‌న న‌టించేందుకు చ‌ర్చ‌లు సాగిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంటుంది. ఇత‌ర కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రుహాని త‌దుప‌రి నటుడు నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న `మీట్ క్యూట్` అనే సిరీస్ లో కనిపించనుంది. యోడ్లీ ఫిల్మ్స్ నిర్మిస్తున్న `ఆగ్రా` అనే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగు సినిమాల్లో న‌టిస్తూనే బాలీవుడ్ లో ల‌క్ చెక్ చేసుకోనుంది.