Begin typing your search above and press return to search.

వీపందం ఎర వేసి క‌వ్విస్తున్న బికినీ బ్యూటీ

By:  Tupaki Desk   |   2 April 2023 5:00 PM GMT
వీపందం ఎర వేసి క‌వ్విస్తున్న బికినీ బ్యూటీ
X
వీపు చూడు వీపందం చూడు! అంటూ ఇక్క‌డ బీచ్ ఇసుక‌లో హొయ‌లు పోతున్న ఈ అమ్మ‌డు ఎవ‌రో క‌నిపెట్టారు క‌దా?... పేరు రుహీ సింగ్. మ‌ధుర్ భండార్క‌ర్ క్యాలెండ‌ర్ గార్ల్స్ చిత్రంతో న‌లుగురిలో ఒక‌ న‌టిగా ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత మోడ‌ల్ గా న‌టిగా డ్యూయ‌ల్ ర‌న్ ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తోంది. సింగ్ లో రెబ‌లియ‌న్ యాటిట్యూడ్ హాట్ కంటెంట్ కి యూత్ లో బోలెడంత ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

క్యాలెండర్ గర్ల్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన‌ రూహీ సింగ్ తొలి ప్ర‌య‌త్న‌మే అందాలు ఆరబోత‌తో దుమారం రేపింది. అయినా ఆ సినిమా త‌ర్వాత అమ్మ‌డికి స‌రైన ఆఫ‌ర్లు లేవు. ప్రస్తుతం మోడల్ గానే కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇటీవ‌లే మంచు విష్ణు మోసగాళ్లు లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.

రూహీ అంద‌చందాలతో ట్రీట్ మైమ‌రిపించినా కానీ.. ఈ సినిమా డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ కెరీర్ కి మైన‌స్ గా మారింది. ఇప్ప‌ట్లో టాలీవుడ్ లో మ‌రో అవ‌కాశం క‌ష్ట‌మే. ఆ క్ర‌మంలోనే రూహీ య‌థావిధిగానే సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్లో త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే రూహీ బోల్డ్ ఫోటోషూట్లు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా అంతర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా మ‌రో హాటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకొచ్చింది. రూహీ బీచ్ ఇసుక‌లో అర్థ‌న‌గ్నంగా బికినీలో హొయ‌లు పోయిన తీరు హీట్ పెంచేస్తోంది. రెడ్ టూపీస్ లో వీపందం హైలైట్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. ఈత దుస్తుల్లో క‌నిపించినా బికినీ ల్లో వ‌య్యారాలు వ‌డ్డించినా రూహీ త‌ర్వాతే. బోల్డ్ ఫోటోషూట్ల‌తో టూమ‌చ్ గా ఫాలోవ‌ర్స్ ని సంపాదించింది! అంటూ అభిమానులు ఈ ఫోటోకి కామెంట్లు జోడిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. క్యాలెండ‌ర్ గ‌ర్ల్ తో కెరీర్ ప్రారంభించి ఇష్క్ ఫ‌రెవ‌ర్.. బొంగు.. ఆప‌రేష‌న్ కోబ్రా అనే చిత్రాల్లో న‌టించింది. తెలుగులో మంచు విష్ణు మోస‌గాళ్లు చిత్రంలోను రూహీ న‌టించింది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ సినిమా ఫ్లాపైంది. గ‌త ఏడాది ఆగ‌స్టులో రుహీ సింగ్ నెట్ ఫ్లిక్స్ షో సోషల్ కరెన్సీ స్ట్రీమింగ్ అయింది. భారతదేశంలోని అగ్రశ్రేణి సెల‌బ్రిటీల్లో ఎనిమిది మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ లు తమ వ్యక్తిగత ఫోన్ లు..వెరిఫైడ్ హ్యాండిల్స్ .. ఆన్ లైన్ ఫాలోయింగ్ తో సంబంధం లేకుండా 21 రోజుల పాటు పోటీపడే షో ఇది. రూహీ ఈ షోలో ఒక బాస్ లేడీగా అత్యంత శక్తివంతమైన ప్రభావశీలిగా న‌టించింది.