Begin typing your search above and press return to search.

లేడీ పవర్ స్టార్‌ ఫీల్‌ అయితే ప్రేమించేస్తానంటోంది

By:  Tupaki Desk   |   15 Jun 2022 2:30 AM GMT
లేడీ పవర్ స్టార్‌ ఫీల్‌ అయితే ప్రేమించేస్తానంటోంది
X
టాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో అన్ని భాష ల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. హీరోయిన్ గా ఆమె స్టార్ డమ్‌ ఏంటీ అనేది ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అన్ని భాషల ప్రేక్షకుల్లోకి తెలుగు ప్రేక్షకులు సాయి పల్లవిని ఎక్కువగా అభిమానిస్తారు అనే టాక్ ఉంది. తెలుగు ప్రేక్షకులు సాయి పల్లవికి ఏకంగా లేడీ పవర్ స్టార్‌ అంటూ బిరుదు ఇచ్చేశారు.

హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తున్న సినిమాలు చాలా తక్కువే అయినా కూడా అద్బుతమైన పాత్రలు చేయడం ఆమెకే చెల్లింది. తాజాగా విరాటపర్వం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్బుతమైన సినిమా అంటూ విరాటపర్వం గురించి తెగ ప్రచారం చేస్తున్నారు. సాయి పల్లవి రెండు వారాలుగా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ సినిమాను ప్రమోట్‌ చేస్తోంది.

తాజాగా సుమ యాంకర్ గా వ్యవహరించే క్యాష్ షో లో పాల్గొంది. మీరు అక్కడ ఉన్నారు... ఇక్కడ కూడా ఉంటారా అంటూ సుమను ఫన్నీగా ప్రశ్నించి తన క్యూట్ నెస్ ను మరోసారి బయట పెట్టింది. హీరోయిన్ గా సాయి పల్లవి ఏ స్థాయికి వెళ్లినా కూడా చాలా నాచురల్ గా వ్యవహరించడం అందరికి నచ్చుతుంది. తాజాగా క్యాష్ షో లో ఆమె చాలా క్యూట్‌ గా ప్రతి ఒక్కరితో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.

క్యాష్ షో లో స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వారిలో ఒక కుర్రాడు మీకు ఎలా ప్రపోస్‌ చేస్తే ఓకే చెప్తారు అంటూ ప్రశ్నించగా చాలా సింపుల్‌ గా తన సమాధానం చెప్పేసింది. సాదారణం గా అయితే అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ మాట్లాడుతారు. కాని సాయి పల్లవి మాత్రం తాను ఫీల్‌ అయ్యేలా ప్రపోజ్ చేస్తే ప్రేమించేస్తాను అంటూ చెప్పి అందరికి ఆశ్చర్యపర్చింది.

సాయి పల్లవి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ప్రస్తుతం విరాటపర్వం సినిమా పై చాలా అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటించాడు. ఈనెల 17వ తారీకున విడుదల కాబోతున్న విరాటపర్వం సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు అంతా సిద్ధం చేశారు.