Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌వికి హైకోర్టులో ఎదురు దెబ్బ‌

By:  Tupaki Desk   |   7 July 2022 4:22 PM GMT
సాయి ప‌ల్ల‌వికి హైకోర్టులో ఎదురు దెబ్బ‌
X
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో న‌టి సాయిప‌ల్ల‌వి కోర్టు వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. క‌శ్మీర్ ఫైల్స్ మూవీతో ముడిపెడుతూ.. కాశ్మీరీ పండిట్ల హత్యకు.. గోసంరక్షణ పేరుతో ముస్లిముల‌పై కొంద‌రి ధాష్టీకానికి ఏమాత్రం తేడా లేద‌ని వ్యాఖ్యానించిన సాయి పల్లవి పై పోలీస్ కేస్ ఫైల్ అయింది. సాయిప‌ల్ల‌వి వ్యాఖ్య‌ల‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీ పిటిషన్ వేసింది. న్యాయపరమైన అభిప్రాయం తీసుకుని విచారిస్తామ‌న్న పోలీసులు అనంత‌రం దీనిపై ముందుకు వెళ్లారు. అయితే త‌న‌పై ఫైల్ అయిన పిటీష‌న్ ని కొట్టి వేయాల‌ని సాయిప‌ల్ల‌వి హైకోర్టులో అర్జీ పెట్టుకుంది. కానీ దీనిని హైకోర్టు తిర‌స్క‌రించింది.

అప్పుడు మొద‌లైన వివాదమిది..

`విరాట పర్వం` ప్రమోషన్ల లో ఓ ఇంట‌ర్వ్యూలో సాయిప‌ల్ల‌వి కాశ్మీర్ మారణహోమాన్ని గోహ‌త్య‌ల‌తో పోల్చారు. కాశ్మీరీ పండిట్ల హత్యలతో పోలిక చెబుతూ.. గోహ‌త్య‌ల పేరుతో ముస్లిముల‌ను హింసిస్తున్నార‌నే అర్థంలో సాయిప‌ల్ల‌వి వ్యాఖ్యానించడ‌మే దీనికి కార‌ణం. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఒపీనియ‌న్ సోషల్ మీడియాలో డివైడ్ టాక్ కి కార‌ణ‌మైంది. ఒక వర్గం ప్రజలు పల్లవి వైపు మొగ్గు చూపగా.. మరికొందరు ఆ రెండిటిని పోల్చ‌డం స‌రిగా లేద‌ని అభిప్రాయపడ్డారు. రాజ‌కీయాల‌పై అభిప్రాయం అడిగినప్పుడు సాయి పల్లవి తాను సైద్ధాంతికంగా తటస్థంగా ఉన్నానని తెలిపారు. అలా పెరిగానని చెప్పింది. వామపక్షాలు లేదా ఇత‌ర పక్షాల్లో ఏవి సరైనవో తనకు తెలియదని అన్నారు. ``నేను తటస్థ వాతావరణంలో పెరిగాను. నేను వామపక్షాలు లేదా రైట్ వింగ్ గురించి విన్నాను. కానీ వీళ్ల‌లో ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది నేను చెప్పలేను`` అని అన్నారు.

`ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రంలో కాశ్మీరీ పండిట్లను ఎలా హతమార్చారు అన్న‌ది చూపించారు. ఇటీవల ఆవును త‌ర‌లిస్తున్న‌ ఓ వ్యక్తిని ముస్లిమ్ అని అనుమానించి చంపిన ఘటన గుర్తుంది. ఆ వ్యక్తిని చంపిన తర్వాత దాడి చేసిన వ్యక్తులు `జై శ్రీరామ్` నినాదాలు చేశారు.. దానికి దీనికి తేడా ఎక్కడ ఉంది? కాశ్మీర్ లో జరిగిన‌దే ఇక్క‌డా జ‌రిగింది`` అని సాయిప‌ల్ల‌వి వ్యాఖ్యానించింది.