Begin typing your search above and press return to search.

ఆ షో అంటేనే సాయి పల్లవికి అసహ్యం!

By:  Tupaki Desk   |   6 Nov 2022 11:30 PM GMT
ఆ షో అంటేనే సాయి పల్లవికి అసహ్యం!
X
సాయి పల్లవి అనగానే డాన్స్ గుర్తుకు వస్తుంది. టాలీవుడ్ తో పాటు సౌత్ స్టార్ హీరోయిన్స్ లో సాయి పల్లవి చేసినట్లుగా ఏ ఒక్క హీరోయిన్ డాన్స్ చేయలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సాయి పల్లవి తాజాగా డాన్స్‌ షో ల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

డాన్స్ పోటీలు అంటే నాకు అసహ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. గతం లో ఈటీవీలో ప్రసారమైన ఢీ డాన్స్ షో తో పాటు ఎన్నో డాన్స్ షో లో సాయి పల్లవి సందడి చేసింది, అలాంటి సాయి పల్లవి ఇప్పుడు డాన్స్ షో ల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్ గా సాయి పల్లవి ప్రస్తుతం ఈ స్థాయి క్రేజ్ దక్కిందంటే అది కేవలం డ్యాన్స్ షో కారణమని అలాంటి డాన్స్ షో లనే అవమానించే విధంగా అసహ్యం అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ సాయి పల్లవి పై కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఇంతకు సాయి పల్లవి ఏమన్నదంటే డాన్స్ షో లో ప్రతిభ కు గౌరవం లేదు.. ఆ కారణంగానే డబ్బు లేదా ప్రముఖుల వారసులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వాటిని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది అంటూ సాయి పల్లవి ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయి పల్లవి డాన్స్‌ షో ల గురించి చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తున్నారు.

సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేసే అవకాశాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ అమ్మడు వరుసగా సినిమాలు అయితే చేయడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి వంటి స్టార్‌ లో కూడా ఈమె నటించేందుకు ఒకానొక సమయంలో నో చెప్పడం చర్చనీయాంశం అయ్యింది.