Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో యువ స‌చ‌ల‌నం..ఎవ‌రీ భామ?

By:  Tupaki Desk   |   18 April 2022 2:30 PM GMT
టాలీవుడ్ లో యువ స‌చ‌ల‌నం..ఎవ‌రీ భామ?
X
మొద‌టి సినిమా ఇంకా రిలీజ్ కాక‌ముందే యువ భామ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. వ‌రుస‌గా ఛాన్సులు అందుకుంటూ అంద‌రి క‌ళ్లు త‌న‌వైపుకి తిప్పుకుంటుంది. `ఏజెంట్` భామ‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ నే రౌండప్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. `ఏజెంట్` ఇంకా రిలీజ్ అవ్వ‌లేదు. అప్పుడే అమ్మ‌డిని మెగా ఆఫ‌ర్లు వ‌రించిన‌ట్లు క‌నిపిస్తుంది.

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న ఓ సినిమాకి హీరోయిన్ గా ఎంపికైంద‌ని స‌మాచారం. అలాగే మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న ఛాన్స్ అందుకుంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఈ సంచ‌ల‌నాలు ఏంటి? `ఏజెంట్` భామ‌కి ఇదంతా ఎలా సాధ్య‌మైంది? అస‌లు ఈ భామ ఎక్క‌డ నుంచి ఊడిప‌డిన‌ట్లు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఆమె పేరు సాక్షి వైద్య‌. మోడ‌ల్ గా కెరీ్ర ప్రారంభించింది.

ప‌లు యాడ్స్ చేసింది. అవి స్టైలిష్ మేక‌ర్ సురేంద‌ర్ రెడ్డి దృష్టిలో ప‌డ్డాయి. దీంతో ఆమె వివ‌రాలు ఆరా తీసి ఫోటో సెష‌న్ నిర్వ‌హించి `ఏజెంట్ `లో హీరోయిన్ గా ఎంపిక చేసారు. లీక్డ్ ఫోటోల‌తోనే హాట్ భామ‌గా ఫేమ‌స్ అవుతుంది. అమ్మ‌డి ఎత్తు..బ‌రువు టాలీవుడ్ హీరోల‌కు ప‌క్కాగా మ్యాచ్ అవుతుంది. అందం..అభిన‌యంగల నాయిక‌. అందుకే మేక‌ర్స్ అమెని రౌండ‌ప్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

ఇది ఆరంభం మాత్ర‌మే. ఏదైనా అమ్మ‌డి ఫేట్ని డిసైడ్ చేసేది స‌క్సెస్ మాత్ర‌మే. `ఏజెంట్` అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఆగ‌స్టులో రిలీజ్ అవుతుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఇదొక స్పై థ్రిల్ల‌ర్. రొమాంటిక్ స‌న్నివేశాల‌కు ఆస్కారం ఉంది. సూరి సినిమాలో వాటికి ఎక్కువ‌గా స్కోప్ ఉంటుంది.

మ‌రి అఖిల్ తో రొమాన్స్ స్థాయి తెలియాలి అంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. టాలీవుడ్ లో స‌క్సెస్ అవ్వాలంటే ట్యాంలెంట్ తో పాటు కొన్ని క్వాలిటీస్ తప్ప‌నిస‌రి. అస‌లే పోటీ ప‌రిశ్ర‌మ‌. రోజుకొక భామ దిగుమ‌తి అవుతుంది. వాళ్ల‌ని త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం అంటే చిన్న విష‌యం కాదు. మ‌ల్టీ ట్యాలెంట్ అయి ఉండాలి. సాక్షి వైద్య లో అడిష‌న్ క్వాలిఫికేష‌న్స్ ఏంటి? అన్న‌ది తెలియాలి. సాక్షి ముంబైలో పుట్టి పెరిగింది. అక్క‌డే మోడ‌లింగ్ చేసింది. చ‌దువు పూర్త‌యిన వెంట‌నే గ్లామ‌ర్ ఫీల్డ్ లోకి దిగింది.