Begin typing your search above and press return to search.

సమంత అంటే అందుకే అంత లవ్

By:  Tupaki Desk   |   22 Sep 2016 10:30 PM GMT
సమంత అంటే అందుకే అంత లవ్
X
టాలీవుడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు.. సౌత్ అంతా క్రేజ్ సంపాదించుకుంది. ఈ మధ్య కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడం...త్వరలో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోనుందనే వార్తలకు స్ట్రెంగ్త్ ఇస్తున్నాయి. అయితే.. సమంతను లక్కీ హ్యాండ్ అని చాలామంది నిర్మాతలు అనుకుంటూ ఉంటారు. ఆడియన్స్ మాత్రమే కాదు.. సినీ జనాలు కూడా సమంతను తెగ ప్రేమించేయడానికి బోలెడన్ని రీజన్స్ ఉన్నాయి.

ఏ హీరోయిన్ తో పోల్చినా.. చెన్నై సుందరి సమంతకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. లాంగ్ లాంగ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లకపోయినా.. ఈ ఏడాది సంగతే చూసుకున్నా.. ఐదు సినిమాలు చేస్తే.. అందులో నాలుగు సూపర్ హిట్స్., బ్లాక్ బస్టర్స్. విజయ్ తెరి.. సూర్య 24.. నితిన్ అ ఆ.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లతో భారీ సక్సెస్ లు అందుకుంది. ఏ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సమంత ఈ స్టేజ్ కి చేరుకుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విజయాలు సాధించే హీరోయిన్ అని మాత్రమే కాకుండా.. ఫిమేల్ ఓరియెటెండ్ సినిమాలను లీడ్ చేయగల సత్తా ఈమెకు ఉంది. అ..ఆ..తో ప్రూవ్ కాగా.. త్వరలో కన్నడ యు-టర్న్ కి తెలుగు రీమేక్ చేయనుంది సమంత.

తాను కొత్త సినిమాలేవీ సైన్ చేయకపోవడానికి కారణం.. తనకు సరైన ఆఫర్స్ రాకపోవడమే అని ఓపెన్ గా చెప్పగల ధైర్యం ఉన్న ఏకైక స్టార్ హీరోయిన్ ఈ భామ. ఇక ప్రత్యూష సపోర్ట్ తో పదిమందికీ సాయం చేసే సమంతను.. ఎంత ప్రశంసించినా తక్కువే అనే టాక్ ఉంది. అందుకే ఇండస్ట్రీ జనాలతో పాటు అభిమానులు కూడా సమంతను అంతగా ప్రేమించేస్తారు.