Begin typing your search above and press return to search.
నయన్, రష్మిక.. ఇప్పుడు సమంత
By: Tupaki Desk | 26 Oct 2022 2:30 AM GMTసౌత్ హీరోయిన్స్ మొన్న మొన్నటి వరకు కూడా కోటి రూపాయలు పారితోషికం తీసుకోవడం అంటే గొప్ప విషయం. ఇప్పటికి కూడా చాలా మంది హీరోయిన్స్ కోటి రూపాయల లోపు పారితోషికం ను తీసుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. కోటి కి పైగా పారితోషికం తీసుకునే వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
ఇక కోటి దాటి మూడు నాలుగు అయిదు కోట్ల పారితోషికం తీసుకుంటున్న వారు ముగ్గురు ఉన్నారు. నయనతార చాలా కాలంగా మూడు నాలుగు కోట్ల పారితోషికం ను అందుకుంటున్న విషయం తెల్సిందే. ఆ మధ్య ఒక తమిళ సినిమాకు ఏకంగా అయిదు కోట్ల పారితోషికం తీసుకుందని వార్తలు వచ్చాయి.
ఇటీవలే రష్మిక మందన్నా అయిదు కోట్ల పారితోషికంను డిమాండ్ చేస్తుందనే వార్తలు వచ్చాయి. పుష్ప 2 సినిమా కు గాను ఆమె నాలుగు నుండి అయిదు కోట్ల పారితోషికం అందుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 సక్సెస్ అయితే ఈమె పారితోషికం మరింత పెరుగుతుందని అంటున్నారు.
నయనతార మరియు రష్మిక మందన్నా తర్వాత సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా సమంత జాబితాలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు రెండు మూడు కోట్లు కాస్త అటు ఇటుగా పారితోషికం అందుకున్న సమయంత తన పారితోషికంను ఒక్కసారిగా భారీగా పెంచి నిర్మాతలకు షాక్ ఇచ్చిందట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యశోదా.. ఖుషి.. శాకుంతలం సినిమాలతో పాటు హిందీలో చేస్తున్న సినిమాలు.. కమిట్ అయిన సినిమాలు పూర్తి అయితే తన స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని తన మార్కెట్ ని చూపిస్తూ కొత్తగా సైన్ చేయాలంటే అయిదు కోట్ల రూపాయలు కావాల్సిందే అంటూ సమంత డిమాండ్ చేస్తుందట.
ఆమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఐటం సాంగ్ కి కోటిన్నర నుండి రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పే నిర్మాతలు హీరోయిన్ గా ఆమెతో చేయించేందుకు అయిదు కోట్ల పారితోషికం ఇచ్చేందుకు వెనకాడక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.