Begin typing your search above and press return to search.

హిందీ నేర్చుకుని ఫుట్ బాల్ ఆడుతుంద‌ట‌

By:  Tupaki Desk   |   30 Sep 2022 2:30 AM GMT
హిందీ నేర్చుకుని ఫుట్ బాల్ ఆడుతుంద‌ట‌
X
రోమ్ వెళితే రోమ‌న్ లా ఉండాలి. ప‌క్కా మాస్ రాజా ఫ‌లక్ నుమా దాస్ ని నేను అంటే అక్క‌డ‌ కుద‌ర‌దు. హైదరాబాదీ యాస బాడీ లాంగ్వేజ్ యూర‌ప్ దేశాల్లో అచ్చి రావు. అందువ‌ల్ల యూర‌ప్ లేదా రోమ్ కి వెళ్లే ముందే చాలా ప్రిప‌రేష‌న్ తో వెళ్లాలి. అక్క‌డ స్థానిక భాష‌ల గురించి సంస్కృతి గురించి కూడా తెలుసుకుంటే ఇంకా మంచిది.

కానీ ఇప్పుడు హైద‌రాబాద్ నుంచి నేరుగా ముంబై ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన స‌మంత తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు చూస్తుంటే వామ్మోవ్ ! అంటూ నాలుక్క‌రుచుకుంటారు. స‌మంత‌కు ఇప్ప‌టికి హిందీ అంతంత మాత్రంగా తెలుసు.. కానీ పూర్తిగా రాదు. హిందీ లో ఫ్లూయెన్సీ.. మాసీ స్టైల్ లో యాస‌ త‌న‌కు ఇంకా తెలీదు క‌దా! అందుక‌నే ఇప్పుడు హిందీ మాండ‌లీకంలో యాస కూడా నేర్చేసుకుంటోంద‌ట‌. అందుకోసం స్పెష‌లిస్ట్ అయిన హిందీ ట్యూట‌ర్ ని కూడా నియ‌మించుకుంద‌ని తెలిసింది.

స‌మంత న‌టిస్తున్న సిటాడెల్ సిరీస్ తో హిందీ బెల్ట్ ని మెప్పించ‌డ‌మే ధ్యేయంగా స‌మంత పూర్తిగా భాష‌ను నేర్చుకుంటోంది. రాజ్ అండ్ డీకే దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. రస్సో బ్రదర్స్ నిర్మించిన సిటాడెల్ భారతీయ వెర్షన్ లో వరుణ్ ధావన్ -సమంతా రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సిటాడెల్ అమెరికన్ సిరీస్ లో ప్రియాంక చోప్రా - రిచర్డ్ మాడెన్ నటించారు. సామ్ న‌టిస్తున్న సిటాడెల్ 2023లో ప్రసారమయ్యే అవకాశం ఉంది.

ఫ్యామిలీ మ్యాన్ 2 ఎఫెక్ట్ ...!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు `ది ఫ్యామిలీ మ్యాన్ 2`తో హిందీ వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టిన తర్వాత బాలీవుడ్ నుండి వ‌రుస ఆఫర్ లను అందుకుంటోంది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ను ఎంచుకునే ముందు చాలా స‌మ‌యం వెచ్చిస్తోంది. సెల‌క్టివ్ గా మంచి స్క్రిప్టుల‌కు ఓకే చెబుతోంది.

రాజ్ అండ్ డీకే ప్రాజెక్టుల‌తో పాటు.. ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్ దినేష్ విజన్ త‌దుప‌రి చిత్రంలో నటించేందుకు స‌మంత అంగీక‌రించింది. స్త్రీ- భేదియా - ముంఝా తర్వాత అత‌డి నుంచి హారర్ కామెడీ రానుంది. మాడాక్ ఫిల్మ్స్ లో ఇది వ‌రుస‌గా నాల్గవ చిత్రం అవుతుంది. సమంతా రూత్ ప్రభు ఇందులో యువరాణిగా నటించనున్నారు. ఈ హారర్-కామెడీలో ఆయుష్మాన్ ఖురానా రక్త పిశాచి పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీ కోసం నిర్మాత దినేష్ విజన్ సమంతా రూత్ ప్రభుని సంప్రదించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. చ‌ర్చ‌లు ముగిసాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి స‌మంత అధికారికంగా సంతకం చేసినట్లు తెలుస్తోంది. హారర్-కామెడీ విశ్వాన్ని (యూనివ‌ర్శ్) ముందుకు తీసుకెళ్తున్న ఈ చిత్రంలో తార‌లంతా ఫాంటసీ పాత్రలను పోషిస్తారు. తాజా క‌థ‌నాల ప్రకారం..ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వ‌హిస్తారు. నిరేన్ భట్ స్క్రిప్ట్ రాయనున్నారు.

ఇటీవల‌ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి సామ్ వర్క్ షాప్ లలో పాల్గొంది. రాజస్థాన్ నేప‌థ్యంలో మరో జానపద కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని సామ్ ఈ మూవీలో రాజ్ పుత్ యువరాణిగా అలాగే ప్రేతాత్మ (దెయ్యం)గా న‌టిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఆయుష్మాన్ ఆమె ప్రేమికుడిగా కనిపిస్తారు. విజయ్ దేవరకొండ తో ఖుషీ.. అలాగే యశోద సినిమాల్లోనూ సామ్ న‌టిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.