Begin typing your search above and press return to search.
వెయ్యి కోసం 3 గంటలు నుంచున్న సమంత
By: Tupaki Desk | 10 Aug 2016 5:36 AM GMTచెన్నై సుందరి సమంత రెమ్యూనరేషన్ ఇప్పుడు కోట్లలోనే ఉంటుంది. స్టార్ హీరోయిన్ కాబట్టి.. సమంత ఫోటో కనిపిస్తే థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ఉంటారు కాబట్టి.. సామ్స్ లక్కీ హ్యాండ్ అనే స్టాంప్ ఉండబట్టి కోట్ల కొద్దీ ఇచ్చేసి సినిమాల్లో బుక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడీ స్టేజ్ లో ఉన్నా.. తాను నడిచొచ్చిన దారిని మర్చిపోలేదని సమంత చెబుతోంది.
ఆనాటి అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పడంతో పాటు ఫ్యూచర్ కి కావాల్సిన గైడెన్స్ కూడా ఇచ్చాయట. ఒకానొక టైమ్ లో వెయ్యి రూపాయలు సంపాదించడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని చెబుతున్న సమంత.. ఆనాటి అనుభవాన్ని పంచుకుంది. 'నాకు 14 ఏళ్ల వయసు నుంచే నా అవసరాలకు డబ్బులు సంపాదించుకునేదాన్ని. చిన్నా చితకా పనులు చాలానే చేశాను. పెళ్ళిళ్లు జరిగేటపుడు పన్నీరు జల్లే అమ్మాయిగా కూడా పని చేశా. మూడు గంటలు అలా నిలబడి పన్నీరు జల్లితే.. వెయ్యి రూపాయలు ఇచ్చేవారు.' అని చెప్పింది సమంత.
ఎంత వచ్చింది అనే విషయం కాకుండా.. అది తన కష్టార్జితం అనే ఫీలింగ్ ఎక్కువగా ఉండేదట. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నా ఆ వెయ్యి రూపాయలే గొప్పగా ఉన్నాయని.. ఆనాటి కిక్ రావడం లేదని చెబుతోంది శామ్స్.