Begin typing your search above and press return to search.
ప్రేమ గీమా జాన్తానయ్ అనేసిన సమంత
By: Tupaki Desk | 1 May 2022 1:30 PM GMTసమంత స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజుల్లోనే నటుడు సిద్దార్థ్ తో ప్రేమలో పడిందని అప్పట్లో మీడియా కథనాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని వివాహ బంధంతో భార్యభర్తలు కాబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ని వదిలేసి కొన్నాళ్ల పాటు సమంత చెన్నైలోనే ఉండిపోయింది.
అక్కడ వరుసగా సినిమాలు చేయడంతో పాటు...సిద్దార్ధ్ తో బిజీ సమయం గడపాలనే ఉద్దేశంతోనే తిష్ట వేసినట్లు ప్రచారం సాగింది. కానీ ఆ బంధం పెళ్లి వరకూ దారి తీయలేదు. మధ్యలోనే విగిపోయింది. ఈ బ్రేకప్ వార్తపై మీడియాలో అదే రేంజ్ లో వైరల్ అయింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత సమంత- నాగచైతన్య ప్రేమించుకోవడం..వివాహం చేసుకోవడం...విడిపోవడం గురించి తెలిసిందే.
రెండేళ్లు ప్రేమించుకుని సమంత-నాగచైతన్య వివాహం చేసుకున్నారు. అటుపై మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. అయితే ఈ బ్రేకింగ్ కారణంగా సమంతనే అన్నట్లు ప్రచారం సాగింది. సామ్ టార్గెట్ గా ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సమంత మనో వేదనని ఇన్ స్టా వేదికగా ఎప్పడికప్పుడు పంచుకుంది. ఈ విషయంలో చైతన్య ఇప్పటివరకూ ఎక్కడా స్పందించలేదు గానీ..సమంత మాత్రం పరోక్షంగా కామెంట్ల రూపంలో చెప్పే ప్రయత్నం చేసింది.
మనసు ప్రశాంతత కోసం దేశంలో ఆథ్యాత్మిక మందిరాలు అన్నింటిని చుట్టేసింది. అయితే తాజాగా ప్రేమ గురించి సమంత సంచనల వ్యాఖ్యలు చేసింది. ట్విటర్ లో `ఆస్క్ సామ్` పేరుతో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా బధులిచ్చింది.
``ప్రేమ..ద్వేషం..లాంటి వాటిలో మళ్లీ పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని బధులిచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. ప్రేమ..పెళ్లి విషయంలో సమంత ఎంతగా విసిగిపోయి ఉంటే ఇలా మాట్లాడుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రేమలో బాధని...రిలేషన్ షిప్ లో బాంధవ్యాల్ని మర్చిపోవడం అంత సులభంగా కాదు. గుండెను రాయి చేసుకోవాలి. మనసును నిబ్బరంగా ఉంచుకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఇక సమంత సినిమాల లైనప్ చూస్తే ఇటీవలే `శాకుంతలం` షూటింగ్ పూర్తిచేసింది. అలాగే మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రం `యశోద` చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లింది. ఈ సినిమా సెట్స్ లో ఉంది. తెలుగు..తమిళ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ..మలయాళ..హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. అలాగే కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన `కథువకుల రెండు కాదల్` అనే సినిమాలోనూ నటిస్తోంది. `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్` అనే విదేశీ చిత్రంలోనూ నటిస్తుంది.