Begin typing your search above and press return to search.

అక్కినేని వారి కంటే హై రేంజ్ లో సామ్

By:  Tupaki Desk   |   13 Nov 2022 4:03 AM GMT
అక్కినేని వారి కంటే హై రేంజ్ లో సామ్
X
తెలుగు చిత్ర పరిశ్రమంలో కొంతమంది హీరోలు వరస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని హీరోలు అయితే దారుణమైన డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నారు. అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ అయితే చూడలేదు. తన ఫేవరెట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆఫీసర్ సినిమా నుంచి నాగార్జున వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు

ముఖ్యంగా మన్మధుడు 2 ట్యాగ్ తో కూడా ఆయన డిజాస్టర్ వచ్చింది. గత సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు ఫెస్టివల్ సీజన్లో ఏదో అలా ఆడేసింది. ఇక నాగచైతన్య కూడా దాదాపు అదే పరిస్థితిలో ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా అతని చివరి సినిమా థాంక్యూ అయితే దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇక అఖిల్ కూడా ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అయితే అందుకోలేదు.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కినేని హీరోలపై సమంత పైచేయి అంటూ అనేక రకాల కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. అక్కినేని వారి మాజీ కోడలు అయిన సమంత విడాకులు తీసుకున్న తర్వాత డిఫరెంట్ స్టైల్లో సినిమాల్లో చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తోంది. అయితే ఆమె చేసిన యశోద సినిమా ఇటీవల అక్కినేని హీరోలా సినిమాల కంటే కలెక్షన్స్ ఎక్కువగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ ఫస్ట్ డే యశోద సినిమాకు మూడు లక్షల గ్రాస్ వచ్చింది. కానీ దసరా టైంలో రిలీజైన నాగ్ భారీ సినిమా ‘ది ఘోస్ట్’ తొలి రోజు ఇదే సెంటర్లో 2.35 లక్షలు మాత్రమే వచ్చాయి. తొలి రోజు నాగ్ సినిమాకు హౌస్ ఫుల్స్ పడలేదు. చైతూ సినిమా ‘థాంక్యూ’కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కాకపోతే ‘ది ఘోస్ట్’తో పోలిస్తే కొంచెం మెరుగ్గా రూ.2.63 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ సమంత రెండవ రోజు కూడా యశోద సినిమాతో మెరుగైన కలెక్షన్స్ అందుకొని అక్కినేని హీరోల కంటే హైలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. మరి యశోద బ్రేక్ ఈవెన్ సాధించి మరింత ప్రాఫిట్స్ అందుకుంటుందో లేదో చూడాలి.