Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బ్యూటిఫుల్ బాడీ బిల్డర్

By:  Tupaki Desk   |   6 Jun 2019 11:21 AM GMT
ఫోటో స్టొరీ: బ్యూటిఫుల్ బాడీ బిల్డర్
X
హీరోయిన్ అంటేనే గ్లామర్.. గ్లామర్ అంటేనే హీరోయిన్లు. అందుకే హీరోయిన్లు తమ అందం కాపాడుకోవడానికి నిత్యం కసరత్తులు చేస్తుంటారు. అయితే మెజారిటీ హీరోయిన్లు కార్డియో ఎక్సర్ సైజులు.. యోగా.. జుంబా డ్యాన్స్ లాంటి ఎక్సర్ సైజులపై ఆధారపడతారు కాని చాలా తక్కువమంది మాత్రమే వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. కానీ సమంతా మాత్రం వెయిట్లను ఎత్తడంలో స్పెషలిస్ట్. గతంలో పలుమార్లు భారీ వెయిట్లు ఎత్తుతూ ఆ వీడియోలతో అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా సమంతా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "వారికి అర్థం కాదు. నేను కార్డియో చెయ్యను. ఇదెందుకు చేస్తామంటే ఈ కసరత్తులు చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. #వెయిట్ ట్రైనింగ్ వుమన్ #స్క్వాట్ ది హెవీ #వుమన్ విత్ పవర్". ఫోటోలో రెడ్ కలర్ ప్యాంట్.. బ్లాక్ కలర్ టాప్ ధరించి ఎక్సర్ సైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. వెనక్కు తిరిగి ఉండడంతో ఆమె షోల్డర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో కనిపిస్తోంది. వెయిట్స్ విషయంలో సామ్ తో పోటీ పడగలిగిన హీరోయిన్ మరొకరు లేరనడంలో ఏమాత్రం సందేహం లేదు.

సమంతా ఈ ఫోటో ను పోస్ట్ చేసిన మూడు గంటల్లోపే మూడున్నర లక్షల లైక్స్ వచ్చాయి. కామెంట్లకు లెక్కే లేదు. "బీస్ట్ మోడ్ లో సామ్".. "జిమ్ క్వీన్ సమంతా".. "బ్యూటిఫుల్ బాడీ బిల్డర్".. "పవర్ఫుల్ వుమన్" అంటూ వెరైటీ కామెంట్లు పెట్టారు.కొందరేమో ఇలాంటి ఎక్సర్ సైజులు చేయవద్దని.. కార్డియో చెయ్యమని కోరారు. అయినా సమంతాకు వెయిట్ ట్రైనింగ్ ఇష్టం అంటుంటే.. వెయిట్లు ఎత్తవద్దని సలహా ఇస్తారెందుకో? ఇక సినిమా విషయానికి వస్తే సామ్ కొత్త సినిమా 'ఓ బేబీ' జులై 5 న రిలీజ్ కానుంది.