Begin typing your search above and press return to search.

బరువు పెరగడంతో నా జీవితం తలకిందులైంది

By:  Tupaki Desk   |   27 April 2019 10:01 AM GMT
బరువు పెరగడంతో నా జీవితం తలకిందులైంది
X
తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించిన సమీరా రెడ్డి కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్‌ గా మెల్ల మెల్లగా ఆఫర్లు కోల్పోతున్న సమయంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన కొన్ని నెలలకే సమీరా రెడ్డి గర్బవతి అయ్యింది. బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తానంటూ ఆమె పలు సార్లు గతంలో చెప్పుకొచ్చింది. బాబు పుట్టిన కొన్ని నెలలకే సమీరా రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడిందట. కాని ఆమె ఆశలన్నీ తలకిందులు అయ్యాయి. బాబు పుట్టిన తర్వాత ఒక వ్యాది వల్ల అయిదు నెలల పాటు బెడ్‌ కే పరిమితం అయ్యాను.

అయిదు నెలల పాటు బయటకు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే ఉండటం వల్ల నేను చాలా లావు అయ్యాను. బాబు పుట్టిన తర్వాత వర్కౌట్స్‌ చేసేందుకు వీలు పడలేదు. దాంతో నేను ఏకంగా 102 కేజీల బరువు పెరిగాను. ఆ సమయంలో కొన్ని సార్లు నేనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నన్ను చూసి కొందరు నవ్వుకుని, ఈమె హీరోయిన్‌ సమీరారెడ్డినేనా, ఇలా అయ్యిందే, ఏం అయ్యిందో అంటూ కొందరు చేసిన కామెంట్స్‌ నాకు చాలా బాధకు గురి చేశాయి. ఆ సమయంలో నేను డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయాను. నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి.

నా మానసిక పరిస్థితి బాగాలేదని మానసిక వైధ్యులను కూడా సంప్రదించారు. ఆ సమయంలో వారు ఇచ్చిన సలహాలు మరియు సూచనలు, వారు చెప్పిన తీరుగా ఆలోచించడం చేయడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని నాకు నేను అనుకున్నారు. ప్రస్తుతం నేను రెండవ సారి గర్బవతిని, ఈ విషయాన్ని చాలా సంతోషంగా చెబుతున్నారు. రెండవ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ మునుపటి రూపంకు నేను తప్పకుండా వచ్చేందుకు ప్రయత్నిస్తాను. నా జీవితంలో మళ్లీ ఆ రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.