Begin typing your search above and press return to search.
సంయుక్త.. ఏ తోక తొక్కిందో కానీ..
By: Tupaki Desk | 21 April 2023 6:22 PMటాలీవుడ్ లో ఎప్పుడూ హీరోయిన్ల కొరత ఉంటూనే ఉంటుంది. ఎంత మంది కొత్త హీరోయిన్లు వెండితెరకు పరిచయం అవుతున్నా ఈ కొరత అలానే ఉంటుంది. స్టార్ హీరోలకు హీరోయిన్స్ ఉన్నారు అంటే, సీనియర్ హీరోలకు దొరకరు. వీరిద్దరికీ దొరికారు అంటే యువ హీరోలకు ఇబ్బంది అయిపోతుంది. రష్మిక, పూజా వంటి హీరోయిన్లు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలతో సెట్ అయిపోయారు. కాజల్, శృతిహాసన్ లు సీనియర్ హీరోల సరసన నటిస్తున్నారు.
ఈ క్రమంలో యంగ్ హీరోలకు కృతిశెట్టి, శ్రీలీల లాంటి హీరోయిన్లు ఉన్నా, వారు బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరికి ప్రత్యామ్నాయంగా వినపడుతున్న పేరే సంయుక్త మేనన్. మొదటి సినిమా బీమ్లా నాయక్ లో చేసింది చిన్న రోల్ అయినా, మంచి ఇంపాక్ట్ చూపించింది. క్లైమాక్స్ లో రానాని కాపాడుకునే క్రమంలో ఆమె యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. అమ్మాయి బాగుంది అనే భావన కలిగింది. దానికి తోడు సినిమా కూడా హిట్ అయ్యింది.
ఆ తర్వాదత బింబిసారలో కళ్యాణ్ రామ్ సరసన నటించింది. ఆ సినిమాలో ఆమె ప్రభావం పెద్దగా లేకపోయినా, సినిమా హిట్ కొట్టింది. ఆ వెంటన్ ధనుష్ సార్ లోనూ మెరిసింది. అది కూడా హిట్ కొట్టింది. వరస హిట్లతో దూసుకుపోతున్న ఈ బామ ఖాతాలోకి తాజాగా విరూపాక్ష వచ్చిపడింది. ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. గత సినిమాల్లో హోమ్లీగా కనిపించినా, ఇందులో కాస్త డోస్ పెంచి అలరించింది. దీంతో చాలా సినిమాలకు హీరోయిన్ దొరికేసింది అనే భావన దర్శక నిర్మాతల్లో కలుగుతోంది.
ఈ మధ్యకాలంలో వరస హిట్లతో గోల్డెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నవారు ఎవరూ లేరనే చెప్పాలి. కానీ సంయుక్త మీనన్ మాత్రం నటించిన అన్ని సినిమాలు హిట్ కొట్టేస్తున్నాయి. దీంతో ఈ నమ్మకం కూడా దర్శకనిర్మాతల్లో పడిపోయే అవకాశం ఉంది. కాగా ఈ అమ్మడు త్వరలోనే కళ్యాణ్ రామ్ తో డెవిల్ అనే సినిమాలో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కావడం గమనార్హం. ఇది కూడా హిట్ పడింది అంటే సంయుక్త గోల్డెన్ ఛాన్సొ కొట్టినట్లే. మరి ఈ అమ్మడి ఖాతాలో మరెన్ని హిట్ సినిమాలు పడనున్నాయో వేచి చూడాల్సిందే.