Begin typing your search above and press return to search.

సూప‌ర్ హిట్ ప‌డినా సంయుక్త‌కు ఒరిగిందేమి లేదా?

By:  Tupaki Desk   |   5 Oct 2022 5:38 AM GMT
సూప‌ర్ హిట్ ప‌డినా సంయుక్త‌కు ఒరిగిందేమి లేదా?
X
సంయుక్త మీనన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేరళలో జన్మించిన ఈ బ్యూటీ 'పాప్ కార్న్‌' అనే మలయాళ సినిమా ద్వారా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత తనదైన అందం, టాలెంట్ తో వరుస ఆఫర్లను అందుకున్న ఈ అందాల భామ‌ మలయాళ ఇండ‌స్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

అలాగే తమిళంలోనూ అడపాదడపా సినిమాలు చేసిన సంయుక్త మీనన్.. ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో రానాకు భార్యగా సంయుక్త నటించింది. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

సంయుక్త నటనకు సైతం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అనంతరం సంయుక్త ఇటీవల 'బింబిసార' మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శ్రీ వశిష్ఠ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మించారు.

ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా బింబిసార రికార్డు సైతం సృష్టించింది. ఇక ఈ సినిమాతో సంయుక్త ద‌శ తిరిగినట్టే అని అందరూ భావించారు. టాలీవుడ్ లో ఆమె బిజీ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు.

కానీ అలా జరగలేదు. బింబిసార‌ వంటి సూపర్ హిట్ పడినా.. సంయుక్తకు ఒరిగిందేమీ లేదు. 'బింబిసార‌' తర్వాత ఈమె నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ప్రస్తుతం ఈ భామ ధనుష్‌కు జోడిగా 'సార్' అనే సినిమా చేస్తుంది. బింబిసార కంటే ముందే టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ మూవీ మినహా మరే తెలుగు ప్రాజెక్ట్ సంయుక్త చేతిలో లేదు. అయితే మలయాళం లో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మరి టాలీవుడ్ లో ఈ బ్యూటీ ఎప్పుడు బిజీ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.