Begin typing your search above and press return to search.
నమ్రత సీరియస్.. ఈమె పాపం అంటోంది
By: Tupaki Desk | 13 Dec 2018 5:30 PM GMTఆన్ లైన్ ఫుడ్ డెలవరీ పోర్టల్ జొమాటో సంస్థకు చెందిన డెలవరీ బాయ్ పార్శిల్ ను విప్పి ఎవరు చూడకుండా కాస్త తిని మళ్లీ ప్యాక్ చేసి పార్శిల్ ను ఇవ్వడం పెద్ద దుమారం రేపుతున్న విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా జొమాటో తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జొమాటో ప్యాక్సిల్ పద్దతిని మార్చింది. ఇకపై మద్యలో ఓపెన్ చేయకుండా ఉండేలా కొత్త విధానంలో ప్యాక్ చేసింది. మరో వైపు మధురైలో ఈ సంఘటనకు పాల్పడ్డ వ్యక్తిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది.
ఆ వ్యక్తిని జాబ్ నుండి తొలగించడంతో పాటు - కేసు కూడా పెట్టిందని ప్రచారం జరుగుతుంది. ఇక ఆ డెలవరీ బాయ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ ఈ సంఘటనపై చాలా సీరియస్ అయ్యింది. తాను ఎప్పుడు కూడా పిల్లలకు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయను అంది. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే మరో హీరోయిన్ సంజన మాత్రం ఆ డెలవరీ బాయ్ పై సానుభూతి చూపించింది.
ఆ డెలవరీ బాయ్ ను అంతా కూడా విమర్శిస్తున్నారు. అతడేం పెద్ద దొంగతనం చేయలేదు కదా, అతడి ఆకలి నేరమా అంటూ అంటూ ప్రశ్నించింది. అతడికి మరో ఛాన్స్ ఇస్తే పోయేదేముంది. అతడు కేవలం ఫుడ్ ను మాత్రమే తిన్నాడు, ఆర్డర్ చేసిన వారి ఆస్తులు ఏమీ దొంగిలించలేదు - అందుకే జొమాటో అతడికి మరో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అయితే జొమాటో తమ డెలవరీ పాలసీని మార్చుకోవాలని సంజన సూచించింది. సంజన ట్వీట్ కు జనాలు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను సమర్ధిస్తే మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేస్తున్నారు.