Begin typing your search above and press return to search.

రాజ్ కుంద్రా నయా ప్లాన్: బాలీవుడ్ లో ఆ ఇండస్ట్రీ..

By:  Tupaki Desk   |   2 Aug 2021 5:03 AM GMT
రాజ్ కుంద్రా నయా ప్లాన్: బాలీవుడ్ లో ఆ ఇండస్ట్రీ..
X
అశ్లీల సినిమాలు నిర్మించి వాటిని యాప్స్ లో ప్రసారం చేసిన కేసులో రాజ్ కుంద్రాతోపాటు అతడి కింద పనిచేసే ఉద్యోగి ఉమేష్ కామత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది నటులను ఈ అశ్లీల చిత్రాలలోకి రాజ్ కుంద్రా లాగాడనే ఆరోపణలున్నాయి.

రాజ్ కుంద్రా ఈ యాప్ కోసం కొన్ని సిరీస్ లలో నటించిన టీవీ నటి జోయా రాథోడ్ ఈ వివాదంపై స్పందించారు.తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘తాను రాజ్ కుంద్రాను ఒకసారి కూడా కలవలేదని’ జోయా రాథోడ్ తెలిపారు. ఉమేష్ కామత్ తనను హాట్ షాట్ యాప్ కోసం న్యూడ్ ఆడిషన్ కోరగా అందుకు తాను నిరాకరించానని తెలిపారు.

జోయా మాట్లాడుతూ ‘నేను రాజ్ కుంద్రాను ఎప్పుడూ కలవలేదు. అతడితో మాట్లాడలేదు. అయితే ఉమేష్ కామత్ నుంచి కాల్ వచ్చిందని.. అతడు హాట్ షాట్ ను ను నిర్వహిస్తున్నట్టు తెలిపాడని.. నాకు పెద్ద బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడని’ తెలిపింది. కానీ నేను వీడియో కాల్ లో న్యూడ్ ఆడిషన్ ఇవ్వాల్సి ఉందని ఆ ఆఫర్ ను తిరస్కరించానని తెలిపారు.

ఉమేశ్ కామత్ అరెస్ట్ కు ఇది కేవలం 2 రోజులు ముందు మాత్రమే జరిగిందని జోయా సంచలన నిజాలు వెల్లడించారు. ఈయనే కాదు.. ‘రాయ్ అనే వ్యక్తి కూడా సింగపూర్ నుంచి నాకు కాల్ చేస్తున్నాడని.. మరియు అతడు కూడా నన్ను నగ్నంగా ఆడిషన్ కోసం అడిగాడని ఆమె వెల్లడించారు.

తన మంచి ఇమేజ్ మరియు బాలీవుడ్ లోని కనెక్షన్ లను చూసి అందరూ రాజ్ కుంద్రాను పెద్ద వ్యాపారవేత్తగా భావిస్తారని జోయా అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలాగే అశ్లీల ఇండస్ట్రీని పెద్దగా చేయాలని రాజ్ కుంద్రా చూస్తున్నాడని కొందరు వ్యక్తులు అనగా తాను విన్నానని జోయా సంచలన వ్యాఖ్యలు చేసింది. మేము కళాకారులం అని.. ఈ ఆటలో కేవలం పావులు మాత్రమేనని.. నాలాంటి వ్యక్తులు అశ్లీల స్టార్ గా లేబుల్ చేయబడ్డారని పేర్కొన్నారు.

2004లో బీపీవో ఉద్యోగం చేయడానికి నాగపూర్ నివాసి అయిన జోయా ముంబైకి వచ్చారు. ఆ తర్వాత ‘సౌభాగ్యవతి భవ’, ‘బడే అచ్చే లగ్గే హైన్’, ఫియర్ ఫైల్స్ వంటి టీవీ షోలలో పనిచేశారు. చాలా మంది కొత్త అమ్మాయిల మాదిరిగానే.. జోయా కూడా కొంత మంది వ్యక్తుల వలలో చిక్కుకుంది.

జోయాను బ్రేక్ కోసం ‘శృంగారానికి’ ఒప్పుకోవాలని పలువురు అడిగారట.. దీని గురించి జోయా మాట్లాడుతూ ‘ప్రజలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు.. ముంబైకి కొత్తగా ఎవరైనా రాజీ పడమని అడుగుతారు’ అని పేర్కొంది. ఇమ్రాన్ హస్మి, కంగనారనౌత్ ల సినిమాలో నాకు లభిస్తుందని నాతో అబద్ధం చెప్పారని.. ఆ వ్యక్తి నన్ను కలిసి ఈ సినిమాలో అవకాశం దక్కాలంటే ‘కాంప్రమైజ్’ అయ్యి శృంగారానికి ఒప్పుకోవాలని అతడు నాకు చెప్పాడని జోయా తెలిపింది. దీనికి తాను రాజీ పడలేదని .. అందుకే చిన్న చిత్రాలలో నటించానని తెలిపింది.

అయితే తాను బోల్డ్ సన్నివేశాలలో నటిస్తానని.. దానికి అంగీకరిస్తానని.. కానీ నేను ఎవరితోనూ పడుకోవాల్సిన అవసరం లేదని జోయా హాట్ కామెంట్స్ చేసింది. నెట్ ఫ్లిక్స్ వంటి పెద్ద ఫ్లాట్ ఫాంల కోసం కొన్ని నగ్న సన్నివేశాలలో నటించిన రాధిక ఆప్టే ఇతర నటీమణులను ఉదాహరణగా చూపుతున్నారని జోయా తెలిపారు.మొత్తంగా రాజ్ కుంద్రా ఏకంగా బాలీవుడ్ లాగా అశ్లీల ఇండస్ట్రీని సృష్టించాలనుకుంటున్నట్టుగా జోయా మాటలను బట్టి తెలుస్తోంది.