Begin typing your search above and press return to search.
అందరూ దొంగలే... దొరికితే..
By: Tupaki Desk | 14 April 2018 6:23 AM GMTకాస్టింగ్ కౌచ్ వ్యవహరం గురించి ఓ హీరోయిన్ కొన్ని రోజులుగా మీడియాలో తెగ హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు హీరోయిన్లకి అవకాశాలు రావట్లేదంటూ మొదలెట్టిన ఈ చిన్నది... అవకాశాలు ఇస్తామని చెప్పి... వాడుకుని వదిలేశారని నానా రచ్చ చేసేసింది. ఈమె చేసిన రచ్చకి చాలామంది నటీనటులు కూడా బలయ్యారు. చివరికి ఇండస్ట్రీ పెద్దలే దిగి వచ్చి ఆమెతో రాజీ కుదుర్చుకున్నారు.
ఈ వ్యవహారమంతా టీవీల్లో చూసిన వాళ్లకి చాలా అనుమానాలే కలుగుతున్నాయి. వాడుకుని అన్యాయం వదిలేస్తే సదరు హీరోయిన్ పోలీసు కేసు పెట్టొచ్చుగా... సీబీఐ దర్యాప్తు కోరచ్చు కదా...కానీ ఈమె మాత్రం అలా చేయలేదు. కేవలం మీడియాను వాడుకుని పాపులారిటీ సంపాదించుకుంది. కొందరి పేర్లు బయటికి చెప్పి వారి పరువు తీసేసింది. చట్టపరంగా ఎందుకు పోలేదు... అంటే ఈ హీరోయిన్ పేరు మీద ఓ ఖరీదైన కారు ఉందట. విలాసవంతమైన ఫ్లాటుల్లో నివాసం ఉంటోందట. సినిమా అవకాశాలే రానప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయి? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు జరిపితే అసలుకే మోసం వస్తుందనే భయంతోనే సీబీఐ దర్యాప్తు కోరడానికి భయపడిందట ఆ హీరోయిన్.
ఇన్నాళ్లు విలాసంగా గడిపిన ఈమెకి... కొన్నాళ్ల నుంచి ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయని... అందుకే మీడియాను అడ్డం పెట్టుకుని నానా రచ్చ చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు దిగి వచ్చి ఆమెతో సెటిల్ మెంట్ చేసుకున్నారట. అందులో భాగంగా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ముట్టజెప్పారని టాక్. ఇన్నాళ్లు ఆమెకి సపోర్టుగా మాట్లాడిన వాళ్లందరూ ఈ రాజీ వ్యవహారంతో ఒక్కసారిగా అవాక్కయ్యారట. అందరూ దొంగలే... దొరికితే! అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వాళ్లు.