Begin typing your search above and press return to search.

అదరగొట్టేస్తున్న సన్నజాజి.. అడగాలే కానీ గుండుమల్లెగా మారిపోతుందట

By:  Tupaki Desk   |   6 Aug 2021 3:21 AM GMT
అదరగొట్టేస్తున్న సన్నజాజి.. అడగాలే కానీ గుండుమల్లెగా మారిపోతుందట
X
షాలిని పాండే అన్నంతనే బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మ గుర్తుకు వస్తుంది. అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఆమెకు వచ్చిన ఇమేజ్ తో పోలిస్తే.. విజయ్ కు భారీ ఇమేజ్ సొంతమైంది. అతగాడితో పోలిస్తే ఆ సినిమాలో షాలినికి దక్కిన ఇమేజ్ తక్కువే. అయినప్పటికి అందరి కంట్లో పడిన ఆమె తాజాగా ‘జయేష్ భాయ్ జోర్దార్’ మూవీ చేస్తున్నారు. బొద్దుగా ఉండే షాలినీ ఈ సినిమా కోసం సన్నజాజి మొగ్గలా మారారు. పూర్తి ఫిట్ గా మారిపోవటమే కాదు.. ఆమె అవుట్ లుక్ చూస్తే.. ఈమేనా అర్జున్ రెడ్డి షాలినీ అన్నంతగా మారిపోయారు.

లావుగా ఉన్న వారు సన్నగా మారటం ఎంత కష్టమో తెలియంది కాదు. సినిమాలో పాత్ర కోసం అంతలా సన్నపడిన ఆమె.. పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. తాను చేస్తున్న చిత్రంలో డ్యాన్సర్ గా చేస్తున్నానని.. అందుకే కష్టమైన వర్కువుట్స్ తో సన్నబడినట్లుగా పేర్కొంది.

ఇప్పటికి ఏదైనా కథ డిమాండ్ చేస్తే.. మళ్లీ లావు కావటానికి తాను సిద్ధమంటూ చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా లావు నుంచి సన్నబడిన తర్వాత.. మళ్లీ బరువు పెరగటానికి అస్సలు ఇష్టపడరు. కానీ.. షాలినీ మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటి సన్నజాజి రూపాన్ని మార్చేసి గుండుమల్లెగా మారాలంటే రెఢీ అంటోంది. అయితే.. అమ్మాయిలు అన్నంతనే ఇలా ఉండాలన్న మైండ్ సెట్ సరికాదంటోంది.

తన వరకు మాత్రం బరువు విషయంలో తాను ఎలాంటి ఒత్తిడికి గురి కానని స్పష్టం చేస్తోంది. తగ్గాలంటే తగ్గటం.. పెరగాలంటే పెరగటం.. అదంతా సినిమాలో పాత్ర కోసం దేనికైనా సిద్ధమంటున్న ఆమె షేపుల్ని మార్చేసే సినిమా ఆమెకు వస్తుందో? రాదో? కాలమే దీన్ని డిసైడ్ చేయాలి.