Begin typing your search above and press return to search.
ముక్కలుగా నరికి తమ్ముడి హత్య.. హీరోయిన్ అరెస్టు!
By: Tupaki Desk | 24 April 2021 4:30 AM GMTకన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్ తమ్ముడు హత్యకు గురయ్యాడు. దారుణంగా హతమార్చి ముక్కలు ముక్కలుగా నరికేసి, బాడీ పార్ట్స్ ను చెల్లా చెదురుగా పడేశారు. ఈ కేసులో సదరు హీరోయిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది.
శాండల్ వుడ్ వర్ధమాన నటి శనయా సోదరుడు రాకేష్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడని తెలుస్తోంది. రాకేష్ కనిపించట్లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే.. ఎలాంటి ఆధారమూ లభించకపోవడంతో.. రాకేష్ కాల్ డేటా సేకరించారని, దీని ప్రకారం విచారణ సాగించిన పోలీసులు నియాజ్ అహ్మద్ ను నిందితుడుగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఈ నియాజ్.. హీరోయిన్ శనయా ప్రియుడని తెలుస్తోంది. వీళ్లిద్దరూ ప్రేమించుకోవడం రాకేష్ నచ్చలేదని, ఈ విషయమై.. తన సోదరి శనయాతో పలుమార్లు గొడవ పడ్డాడని కూడా ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ.. వీరు తమ ప్రేమను కొనసాగించారని సమాచారం. అయితే.. ఇతడితో మున్ముందు సమస్య ఎదురవుతుందని భావించి చంపేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నియాజ్ కొందరు స్నేహితులతో కలిసి రాకేష్ ను చంపేసి ఓ కారులో దాచారట. అయితే.. మృతదేహాన్ని ఎక్కువ సేపు దాచడం కష్టమని భావించి, బాడీని ముక్కలుగా నరికి, కర్నాటకలోని హుబ్లీ పరిసర ప్రాంతాల్లో పడేసినట్టు ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ముందుగా నియాజ్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ తర్వాత మృతుడి సోదరి, హీరోయిన్ శనయాను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. తన తమ్ముడి హత్యతో తనకు సంబంధం లేదని శనయా చెబుతున్నట్టు తెలుస్తోంది. సోదరుడితో విభేదాలు ఉన్నమాట వాస్తవమేకానీ.. ఈ హత్య తాను చేయలేదని, తనకు ఏ పాపమూ తెలియదని చెబుతోందట. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.