Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ బ్యూటీ చిర కాల కోరిక తీరేదెలా?

By:  Tupaki Desk   |   24 Feb 2023 5:00 AM GMT
సీనియ‌ర్ బ్యూటీ చిర కాల కోరిక తీరేదెలా?
X
అల‌నాటి న‌టి భానుప్రియ చెల్లెలుగా తెరంగేట్రం చేసిన శాంతిప్రియ సుప‌రిచిత‌మే. అప్ప‌టి `మ‌హ‌ర్షి` సినిమాతో లాంచ్ అయిన శాంతి ప్రియ `సింహ‌స్వ‌ప్నం`..`య‌మ‌పాశం`..`ర‌క్త క‌న్నీరు`.. `నాకు పెళ్లాం కావాలి.`.`అగ్ని`..`జ‌స్టిస్ రుద్ర‌మ‌దేవి` లాంటి చిత్రాల్లో న‌టించారు.

ఇంకా హిందీ..క‌న్న‌డ‌...మ‌ల‌యాళ భాష‌ల్లోనూ కొన్ని సినిమాలు చేసారు. అయితే భాను ప్రియ లెగ‌స్సీని మాత్రం శాంతి ప్రియ అందుకోలేదు. చివ‌రిగా బాలీవుడ్ న‌టుడు సిద్దార్ధ్ రాయ్ ని పెళ్లి చేసుకుని ముంబైలో స్థిర‌ప‌డ్డారు. అప్పుడే సినిమాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసారు.

నేను సినిమాలు చేసేటప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ప‌రిస్థితి వేరు. అందరూ ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. మంచి వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. పోటీ ఉన్నా అది చాలా హెల్దీగా ఉంటుంది. అప్ప‌టి రోజులు అలా కాదు. పోటీ త‌క్కువ‌గానే ఉన్నా..ఛాన్స్ లు చాలా క‌ష్ట‌మ‌య్యేవి.

అప్పట్లో నాకు వెంకటేశ్ గారితో కలిసి న‌టించాల‌ని ఉండేది. కానీ కుదరలేదు. నేను హైద‌రాబాద్ కి వ‌చ్చి 30 ఏళ్లు అవుతోంది. చెన్నై వాళ్లు నేను ముంబైలో ఉన్నానని అనుకుంటే.. ముంబైవారు నేను చెన్నైలో ఉన్నానని అనుకుంటున్నారు. ఆ ర‌కంగా అవకాశాలకు దూర‌మ‌య్యాను` అన్నారు.

మ‌రి సెకెండ్ ఇన్నింగ్స్ లో నైనా శాంత్రి ప్రియ చిర కాల కోరిక నెర‌వేరుతుందేమో చూడాలి. వెంక‌టేష్ సినిమాలో ఏదో పాత్ర పోషించే అవకాశం వ‌స్తే న‌టించే ఛాన్స్ ఉంది. వెంకీ కి ఫెయిర్ గా న‌టించాలంటే స్టోరీ అలాంటి పాత్ర‌ని డిమాండ్ చేయాలి.

లేదంటే ఏదో ఒక పాత్ర‌తో సరిపెట్టుకోవాలి. మ‌రి అందుకు శాంతి ప్రియ రెడీగా ఉన్నారా? అన్న‌ది చూడాలి. వాస్త‌వానికి భానుప్రియ‌-శాంతిప్రియ‌లు పుట్టి పెరిగింది రాజ‌మండ్రిలోనే. సినిమా రంగంలోకి వెళ్ల‌డంతో వేర్వేరు చోట్ల స్థిర‌ప‌డ్డారు. శాంతి ప్రియ భ‌ర్త చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అలాగే భానుప్రియ అడ‌పాద‌డ‌పా సినిమాల్లో క‌నిపిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.