Begin typing your search above and press return to search.

400 మంది జూనియర్ ఆర్టిస్టుల ముందు నాపై అరిచాడు

By:  Tupaki Desk   |   7 July 2021 2:30 AM GMT
400 మంది జూనియర్ ఆర్టిస్టుల ముందు నాపై అరిచాడు
X
క‌మిట్ మెంట్ తో పాటు క్ర‌మ‌శిక్ష‌ణ లేనిదే ఇండ‌స్ట్రీ క్ష‌మించ‌దు. ఏ ఇత‌ర రంగంలో లేనంత‌గా ఇక్క‌డ క్ర‌మ‌శిక్ష‌ణ చూస్తారు. ఇన్ సైడ్ బోలెడ‌న్ని ఒత్తిడులు ఉంటాయి. కోట్లాది రూపాయ‌ల బడ్జెట్ల‌తో సాహ‌సాలు చేసే ప‌రిశ్ర‌మ‌లో ఆర్టిస్టుల‌ ప‌ర్ఫెక్ష‌న్ చాలా ఇంపార్టెంట్. అందుకే సినీరంగంలో ఎవ‌రికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుందో చెప్ప‌లేం. ఇక్క‌డ చాలా ప‌రిస్థితులు ఒక్కొక్క‌రిని ఒక్కోలా మార్చేస్తుంటాయి.

అయితే అందాల క‌థానాయిక కామ్న జెఠ్మ‌లానీ త‌న కెరీర్ లో ఆన్ లొకేష‌న్ జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. త‌న‌కు దాదాపు 400 మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల ముందు అవ‌మానం జ‌రిగింద‌ని ఆ ఘ‌ట‌న త‌న‌ను మార్చేసింద‌ని తెలిపారు. ఒక‌రోజు రాత్రి త‌న స్నేహితురాలు పూన‌మ్ బ‌జ్వాతో క‌లిసి వేకువ ఝాము 3గంట‌ల వ‌ర‌కూ ఐస్ క్రీమ్ బ‌కెట్ ని తినే పోటీ పెట్టుకుంద‌ట‌. దాంతో మ‌రుస‌టి రోజు ర‌ణం సెట్స్ కి వెళ్లిన‌ప్పుడు త‌న క‌ళ్లు ముఖం ఉబ్బి క‌నిపించాయి.

నేను తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి వచ్చాను. రెండు గంటల నిదురించి ఆ తరువాత 6 గంటలకు సెట్స్ కి వెళ్లాను.. అని కామ్న తెలిపారు. తన ముఖంలో మార్పును గ్రహించిన దర్శకుడు అమ్మ రాజశేఖర్ నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారని అడిగార‌ట‌. ``నేను తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి చేరుకున్నాను అని తెలిపాను. అతను వెంటనే 400 మంది జూనియర్ ఆర్టిస్టుల ముందు నాపై అరిచేశారు. నేను వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నాను. నాకు రెండు గంటల సమయం ఇచ్చిన తరువాత అతను నాతో సన్నివేశాన్ని చిత్రీకరించాడు`` అని కామ్న‌ చెప్పారు. ఈ సంఘటనతో తాను క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌రుచుకున్నాన‌ని తెలిపారు.

కామ్న బ్యాక్ టు బ్యాక్ అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించారు. కానీ ఆ త‌ర్వాత ఫ్లాపుల వ‌ల్ల ఫామ్ కోల్పోయారు. ఆ త‌ర్వాత ఐటెమ్ నంబ‌ర్లు చేశారు. ప్ర‌స్తుతం మ‌రోసారి ఐటెమ్ నంబ‌ర్ తో తిరిగి కంబ్యాక్ అవ్వాల‌నుంద‌ని కామ్న అన‌డం ఆస‌క్తిక‌రం.