Begin typing your search above and press return to search.
పరుగు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
By: Tupaki Desk | 22 Jan 2023 5:39 AM GMTఅల్లు అర్జున్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో పరుగు మూవీ ఒకటి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయింది. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం అనేది ఈ జనరేషన్ లో చాలా కామన్ అయిపోయింది. అయితే ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకోవడం చాలా చిన్న విషయం కావచ్చు. కానీ దాని వెనుక ఒక కుటుంబం వేదన ఉంటుంది.
తల్లిదండ్రులు జీవితకాలం అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోకుండా ప్రతి అమ్మాయి ప్రేమించిన వాడితో కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడానికి రెడీ అయిపోతుంది. అయితే తల్లిదండ్రులు ఎన్ని అవమానాలు భరించిన కూడా పిల్లల ప్రేమను మాత్రం ఏమీ అనలేరు అనే పాయింట్ తో పరుగు సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమా వచ్చింది. యావరేజ్ టాక్ తో మొదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
ఈ మూవీలో అల్లు అర్జున్ జోడిగా షీలా అనే హీరోయిన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా ఆమె అదుర్స్ మూవీలో ఎన్టీఆర్ కి జోడిగా నటించింది. తర్వాత హీరో రామ్ తో మస్కా సినిమా చేసింది. కన్నడంలో కొన్ని సినిమాలలో నటించింది. అయితే కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ రాకపోవడంతో తర్వాత బ్యూటీ సినిమాలకు స్వస్తి చెప్పింది. తెలుగులో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించింది.
అయితే కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఆంధ్రకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని పెళ్లి చేసుకొని వివాహ జీవితంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం భర్తతో పాటు వ్యాపారంలో భాగస్వామ్యంగా ఉంటూ వ్యాపారవేత్తగా రాణించే ప్రయత్నం చేస్తుంది. ఆమె చివరిగా 2018లో రామ్ హీరోగా తరికెక్కిన హైపర్ మూవీలో కనిపించింది. మొత్తానికి స్టార్ హీరోల పక్కన నటించిన కూడా కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కాలేక కెరియర్ ముగించిన హీరోయిన్స్ జాబితాలో షీలా కూడా ఈ విధంగా చేరిపోయింది.