Begin typing your search above and press return to search.

రాజ్ కుంద్రాపై కామసూత్ర నటి షెర్లిన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   7 Aug 2021 11:33 AM GMT
రాజ్ కుంద్రాపై కామసూత్ర నటి షెర్లిన్ సంచలన వ్యాఖ్యలు
X
అశ్లీల సినిమాల చిత్రీకరణ కేసులో అరెస్టయిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ నటీమణులను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. కొందరిని రిమాండ్ కు పంపించి బెయిల్ పై విడుదల చేశారు. తాజాగా మరో నటి వెలుగులోకి వచ్చింది. రాజ్ కుంద్రాపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. కామసూత్ర 3డి సినిమాలో నటించిన షెర్లిన్ చొప్రా పై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె రాజ్ కుంద్రా గురించి ఆమె ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పింది.

రాజ్ కుంద్రా తనకు కేవలం గ్లామరస్ సినిమాలు అని చెప్పి ఆ తరువాత బోల్డ్ మూవీస్ చేయించారని ఆరోపించింది. సినిమా తీసేముందు తనతో ఒక విధంగా చెప్పి.. ఆ తరువాత మరో రకంగా తనతో వీడియోలు చేయించారని తెలిపింది. పోలీసులు తనను 8 గంటల పాటు విచారించారని, అయితే ఒకేసారి తాను పోలీసుల ముందుకు కూర్చొనే సరికి ఏం చెప్పాలో అర్థం కాలేదన్నారు. రాజ్ కుంద్రాను మొదటి సారి కలిసినప్పుడు తన జీవితం మారిపోతుందని అనుకున్నానన్నారు. కానీ ఇలా లైఫ్ టర్న్ అవుతుందని తెలియదన్నారు.

ఒక్కోసారి రాజ్ కుంద్రా నాతో ‘నీ వీడియోలను చూసి శిల్పాశెట్టి మెచ్చుకున్నారని’ అన్నారు. అయితే నన్ను అలా అన్నప్పుడు ఏదీ తప్పో, ఏదీ ఒప్పో తెలుసుకోలేని స్థితిలో లేనన్నారు. అయితే శిల్పా శెట్టి బీజీగా ఉండడం వల్ల నా వీడియోలను చూడలేరని తరువాత తెలుసుకున్నానని అన్నారు. అయితే తాను రాజ్ కుంద్రాకు, శిల్పా శెట్టి లకు వ్యతిరేకం కాదని, ఫోర్న్ చిత్రాలకు వ్యతిరేకమన్నారు. అయితే వారు ముందే గ్లామర్ చిత్రాలు అని కాకుండా ఫోర్న్ చిత్రాలు అని చెబితు బాగుంటుందని అన్నారు. అలా చెప్పడం వల్ల ముందే డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

మరి నటించేటప్పుడు ఇలాంటి ఆలోచనలు రాలేదా..? అని కొందరు ప్రశ్నించినప్పుడు ‘వాస్తవానికి అలాంటి సమయాల్లో మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. భవిష్యత్ బాగుండాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కొవాలి లాంటి సలహాలు చెప్పినప్పుడు నిజమేనని భావించా’ అని చెప్పారు. ‘ఇక నాకు పుట్టబోయే పిల్లలకు ఇలాంటి ఇండస్ట్రీకి రావద్దని చెబుతా.. ఎందుకుంటే ఇక్కడ స్వార్థ పరులుంటారు. డబ్బుతప్ప ఇంకేం ధ్యాస వుండదు’ అని షెర్లిన్ చొప్రా ఆవేదన చెందారు.

‘రాజ్ కుంద్రా వ్యవహారంతో చాలా నేర్చుకున్నా. ఇక నుంచి ఇలాంటి చిత్రాలు నటించొద్దని నటీమణులు గొంతెత్తాల్సిన అవసరం ఉంది. శిల్పా శెట్టి లాంటి ప్రముఖ నటి ఇది ఫోర్న్ చిత్రం కాదు ఏరోటికా మూవీ అని అనడం ఆశ్చర్యమేసింది. ఒకసారి ఈ సినిమా పూర్తిగా చూసిన తరువాత ఎవరైనా జడ్జిమెంట్ చేయాలన్నారు. నన్ను గన్ పెట్టి నటించమని ఎవరూ బెదిరింలేదు.కానీ తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. మరోసారి ఇలింటి మిస్టేక్ చేయొద్దని డిసైడ్ అయ్యాను’ అని అన్నారు.

ఇదిలా ఉండగా పోలీసులు రాజ్ కుంద్రాకు చెందిన కాంట్రాక్టు కాపీలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఓ కాపీలో ‘నేను ఈ చిత్రాన్ని నా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను. నాపై నిర్మాణ సంస్థ ఎలాంటి ఒత్తిడి లేదు’ అని సంతకం పెట్టడాన్నిగమనించారు. అంతేకాకుండా ఆ సినిమాలను ఓటీటీ లేదా ఎలాంటి వేదికలపైనా విడుదల చేసినా నాకు అభ్యంతరం లేదని విషయం కూడా అందులో ఉందని పోలీసులు తెలిపారు. కొందరు ఇలాంటి వాటిపై సంతకాలు చేయకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు రావని బెదిరించేవారని కొందరు నటీమణులు ఆరోపించారు.