Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : ఈ అందాలకు ఎవ్వరైనా సాహో అనాల్సిందే

By:  Tupaki Desk   |   17 Sep 2022 5:58 AM GMT
ఫోటోటాక్‌ : ఈ అందాలకు ఎవ్వరైనా సాహో అనాల్సిందే
X
మన యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ తో కలిసి సాహో సినిమాలో నటించిన ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ అందాల ఆరబోత విషయంలో అస్సలు పిసినారి కాదు. ఆమె సినిమాల్లోనే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులను ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసే ఉద్దేశ్యంతో అందాల ఆరబోత విషయంలో చాలా బోల్డ్ గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌ లో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉంది. కపూర్ ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా ఎప్పుడు కూడా తాను సినిమా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్‌ నుండి వచ్చాను అనే ప్రౌడ్‌ ని చూపించకుండా ప్రతి ఒక్కరితో చాలా హుందాగా గౌరవంగా వ్యవహరిస్తూ ఉంటుందట.

హీరోయిన్ గా తన సొంత కష్టంతో.. ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్న శ్రద్దా అందం విషయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ సరసన నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈమె అందంతో పాటు అన్ని రకాల పాత్రలను అలవోకగా చేయగల ప్రతిభ ఉన్న నటి. అందుకే ఈమెను అభిమానించే వారి సంఖ్య భారీ ఎత్తున ఉంటుంది అనడంలో సందేహం లేదు.

శ్రద్దా తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బ్లాక్ అండ్‌ వైట్ లోనే ఈ ఫోటోలు ఉన్నా కూడా ఫోటోలు చూస్తున్న వారి కళ్లలో మెరుపు కనిపిస్తుంది. అలాంటి ఫోజ్ లను ఈ అమ్మడు ఇచ్చింది. చాలా కసిగా చూస్తూ థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన ఈ అందాల శ్రద్దా కపూర్ ని చూసి సాహో నీ అందానికి అనకుండా ఎవరైనా ఉంటారా అంటూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

సాహో తర్వాత ఈ అమ్మడు మరో తెలుగు సినిమాలో నటించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్‌ అయ్యింది. అతి త్వరలోనే మళ్లీ తెలుగు లో ఈ అమ్మడు నటించాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అది ఎప్పటికి సాధ్యం అవుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.