Begin typing your search above and press return to search.

యాంకర్ ప్రదీప్ తో పెళ్లి చూపులకు హాజరైన యువనటి మృతి

By:  Tupaki Desk   |   8 Dec 2021 11:44 AM GMT
యాంకర్ ప్రదీప్ తో పెళ్లి చూపులకు హాజరైన యువనటి మృతి
X
యువ య్యూటూబర్, నటి శ్రియా మురళీధర్ గుండెపోటుతో మరణించడం కలకలం రేపింది. సోమవారం రాత్రి సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఊహించని విధంగా 27 ఏళ్ల వయసులోనే ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురికావడం పలువురిని కలిచివేసింది. ఆమె హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు.

మాటీవీలో నిర్వహించిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు 'పెళ్లిచూపులు' రియాలిటీ షోలో శ్రియా మురళీధర్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఫేమస్ అయ్యారు. పలు షార్ట్ ఫిల్మ్ లు చేసి మంచి పేరు సంపాదించారు. 'బ్యూటీ అండ్ ద బాస్' వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లూయెన్సర్ గా ఆమె మెప్పించారు.

నటన అంటే ఎంతో ఇష్టపడే శ్రియా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్లోని లక్డీకపూల్. వాట్ ద ఫన్ యూట్యూబ్ ఛానెల్ లో ఆమె పలు వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు.

బిగ్ స్క్రీన్ పై కూడా రాణించాలని కలలుగన్న ఆమెకు ఈ మధ్యనే సినిమా అవకాశాలు వస్తున్నాయట.. కానీ ఆ కల నెరవేరకుండానే శ్రియా గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. శ్రియా మృతిపట్ల దీప్తి సునయన, సినీ నటి సురేఖ కుమార్తె సుప్రిత ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.