Begin typing your search above and press return to search.

శ్రియా కే పీఛే క్యా హై?

By:  Tupaki Desk   |   1 Jun 2019 11:13 AM GMT
శ్రియా కే పీఛే క్యా హై?
X
సీనియర్ హీరోయిన్ శ్రియ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో 19 ఏళ్ళ క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగడం ఒక వండర్. అదేంటి తెలుగులో ఆమెకు ఆఫర్లేవీ లేవు కదా అంటారా? తెలుగులో లేకపోతే ఏం... హిందీలో 'తడ్కా' లో నటిస్తోంది.. తమిళంలో 'నరకాసురన్'.. 'సండకారి' అనే టైటిల్స్ తో తెరకెక్కే రెండు సినిమాలలో నటిస్తోంది. ఈ సినిమా సంగతేమో కానీ తన పర్సనల్ లైఫ్ లో మాత్రం శ్రియ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది.

శ్రియ గత ఏడాది మార్చ్ లో రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ ను వివాహమాడి రష్యా కోడలయింది. అయితే తన భర్తగారి ఫోటోలను ఎప్పుడూ తన అభిమానులతో షేర్ చేసుకున్నది లేదు. కానీ రెండు రోజుల క్రితం భర్తతో ముద్దుముచ్చట్లాడుతున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా మెక్సికో దేశంలో.. పెరూలో ఇద్దరూ తమ హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ట్రిప్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ప్రస్తుతం ఈ జంట కొలంబియాలో ఉంది. ఈ విషయాన్ని శ్రియ స్వయంగా తెలుపుతూ ఓ ఇదు ఫోటోలు పోస్ట్ చేసింది.

స్కై బ్లూ టీ షర్ట్.. బ్లూ జీన్స్ ధరించిన శ్రియ తనదైన స్టైల్ లో చిరునవ్వులు రువ్వుతూ అల్లరిగా పోజులిచ్చింది. అన్నీ ఫోటోలు బాగానే ఉన్నాయి కానీ లాస్ట్ ఫోటో మాత్రం రచ్చగా ఉంది. నేపథ్యంలో ఒక బోల్డ్ పెయింటింగ్ ఉంది. అందులో బొద్దుగా ఉన్న ఒక యువతి నగ్నంగా పోజిస్తూ ఉంటే.. ఒక చిత్రకారుడు ఆమెను చిత్రాన్ని ఎంతో ఏకాగ్రతగా క్యాన్వాస్ పైకి చిత్రీకరిస్తున్నాడు. ఈ పెయింటింగ్ కు ముందు నిలబడి శ్రియ ఏదో ఊదుతున్నట్టుగా ఒక అల్లరి పోజిచ్చింది. ఇలాంటి పోజులకు అల్లరి కామెంట్లే వస్తాయి కదా? ఒకరు "ఆమె బాంబు వేస్తే ఆ గాలిని నువ్వు డైవర్ట్ చేస్తున్నావా?' అని ప్రశ్నించాడు. శ్రియ నవ్వు బాగుందని ఒకరు.. "శ్రియా కే పీఛే క్యా హై" అని మరొకరు కామెంట్స్ పెట్టారు.