Begin typing your search above and press return to search.
శ్రుతి ఐడియా అదిరింది.. వాడేసిన దుస్తులతో అలా చేస్తుందట!
By: Tupaki Desk | 17 April 2022 2:30 PM GMTప్రముఖ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్.. సిద్దార్థ్ హీరోగా వచ్చిన `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన `గబ్బర్ సింగ్` చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత శ్రుతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుంది.
అయితే కెరీర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సమయంలో శ్రుతి హాసన్ కు అనుకోని షాక్ తగిలింది. లండన్ కుర్రాడు మైఖేల్ కర్సెల్తో కొన్నాళ్లు ప్రేమలో మునిగి తేలిన శ్రుతి.. అతడినే పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ శ్రుతి-మైఖేల్ లు లాస్ ఏంజెల్స్, చెన్నై, ముంబై వంటి చోట్ల చట్టాపట్టాలేసుకుని తిరిగారు. తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు. కానీ, పలు విభేదాలు తలెత్తడంతో చివరకు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నాడు.
ఈ బ్రేకప్ వల్ల డిప్రెషన్ కు గురైన శ్రుతి హాసన్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టి ఫుల్ జ్యోష్ లో దూసుకుపోతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు మరింత చేరువవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దుస్తుల విషయంలో తన ఆలోచనల్ని అందరితోనూ పంచుకుంది. సాధారణంగా సెలబ్రెటీలు ఒక్కసారి వాడిన దుస్తులను మళ్లీ వాడరు. ఈ లిస్ట్ లో శ్రుతి హాసన్ కూడా ఒకరు.
కానీ, వాడేసిన బట్టలను ఆమె పక్కన పడేయకుండా.. వాటితో డబ్బును సంపాదిస్తోంది. అవును, వాడేసిన దుస్తుల్ని మళ్లీ అమ్మకానికి పెడుతుందట. అలా రీసేల్ చేయగా వచ్చిన డబ్బుల్ని ఆమె సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. అలాగే గత క్రిస్మస్ పండగ సమయంలోనూ తనకు ఎంతో ఇష్టమైన దుస్తులు రీ సేల్ చేసి చారిటీ కోసం ఫండ్స్ రైజ్ చేసిందట. మొత్తానికి శ్రుతి తన అదిరిపోయే ఐడియాతో వాడేసిన దుస్తులను వృథా చేయకుండా.. తెలివిగా డబ్బు సంపాదిస్తోంది.
కాగా, శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన `సలార్` సినిమా చేస్తోంది. అలాగే చిరంజీవికి జోడీగా `మెగా 154`, బాలయ్యతో `ఎన్బీకే 107` చిత్రాలు చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. వీటితో పాటే మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేతిలో ఉన్నాయి.