Begin typing your search above and press return to search.
అందాల నటి సీత అప్పటి నుంచి కనిపించదేం!
By: Tupaki Desk | 5 Jun 2021 2:30 AM GMT1980లలో తెలుగు తెరపై సందడి చేసిన అందమైన కథానాయికలలో 'సీత' ఒకరు. పద్ధతికి పట్టుచీర కట్టినట్టుగా కనిపించే సీత, 'ఆడదే ఆధారం' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. ఆ సినిమా గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన 'ముత్యమంత ముద్దు' సినిమా సూపర్ హిట్ కావడంతో, కెరియర్ పరంగా ఇక ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగులో ఆమె కెరియర్ మంచి జోరుమీద ఉండగానే తమిళ నటుడు పార్తీబన్ ను పెళ్లి చేసుకున్నారు.
వివాహమైన తరువాత ఆమె నటనకు దూరం ఉంటూ వచ్చారు. పార్తీబన్ తో విడిపోయిన తరువాతనే ఆమె మళ్లీ మేకప్ వేసుకున్నారు. తెలుగులో 'గంగోత్రి' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె హీరోకి తల్లిపాత్రలో కనిపించారు. అప్పటి నుంచి వరుసగా ఆమె ముఖ్యమైన పాత్రలను చేస్తూ వచ్చారు. 'సింహాద్రి' .. 'బన్నీ' .. 'రభస' .. 'జ్యో అచ్యుతానంద' .. 'గౌతమ్ నంద' వరకూ ఆమె బిజీగానే ఉంటూ వచ్చారు. ఆ తరువాతనే అంటే .. ఒక మూడేళ్లకు పైగా తెరపై ఆమె కనిపించడం లేదు.
ఈ మధ్యలో ఒకటి రెండు ప్రాజెక్టులకు ఆమె పేరు వినిపించింది కానీ ఆమె మాత్రం ఎక్కడా కనిపించలేదు. కొత్తగా రీ ఎంట్రీ ఇస్తున్న చాలామంది సీనియర్ హీరోయిన్లు వరుస అవకాశాలు అందుకుంటున్నారు. కానీ గ్లామర్ పరంగా .. నటన పరంగా ఎలాంటి వంకబెట్టడానికి వీల్లేని సీత ఎందుకు వెనకబడిపోయారనే విషయం మాత్రం అర్థం కావడం లేదు. అటు తమిళ .. కన్నడ సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నారు. తమిళంలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే గ్యాప్ రావడానికి కారణం, అక్కడ ఆమె బిజీగా ఉండటమేనని అనుకోవాలేమో.