Begin typing your search above and press return to search.
పాపం స్నేహ...మొత్తం కత్తిరించేసారు
By: Tupaki Desk | 30 Dec 2017 8:32 AM GMTమనకున్న హోమ్లీ హీరొయిన్స్ లో సౌందర్య తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది స్నేహ గురించే. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోలతో చెప్పుకోదగ్గ సినిమాలే చేసిన స్నేహా ఎందుకో మరి టైం కలిసి రాక ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. తరువాత తమిళ్ లో సెటిల్ అయిపోయి యాక్టర్ ప్రసన్నను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయ్యింది. ప్రసన్న అంటే జవాన్ సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా పరిచయమైనతనే. ఇటీవలే స్నేహ తమిళ్ లో వేలైక్కారాన్ అనే సినిమా ఒకటి చేసింది. రిలీజ్ అయ్యి బాగానే ఆడుతోంది కూడా. అందులో తను ఒక కీలక పాత్ర చేసింది. శివ కార్తికేయన్ హీరోగా నయనతార హీరొయిన్ గా నటించిన ఈ మూవీలో స్నేహకు పాతిక నిముషాలు పాటు కనిపించే రోల్ ఆఫర్ చేసారు.
దీని కోసం రీసెంట్ గా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం పక్కన పెట్టి మరీ బరువు తగ్గి సినిమా కోసం సిద్ధ పడింది. తనకు పేరు తో పాటు ఆఫర్స్ కూడా వస్తాయని ఆశ పడింది. విడుదల అయ్యాక చూస్తే షాక్. తన పాత్రకు సంబంధించిన సీన్స్ మొత్తం ఎడిటింగ్ లో కత్తిరించేసారు కేవలం ఒక ఐదారు సీన్లు మాత్రమే ఉన్నాయి. దీనపై స్నేహ బాగా మనస్తాపానికి గురైంది. తాను ఎంతో కష్టపడి బరువు తగ్గి మరీ పాత్ర చేస్తే ఇలా చెప్పా పెట్టకుండా కట్ చేయటం ఏమిటని అడుగుతోంది. అయినా హీరొయిన్ల సీన్లే తీసేస్తేనే అడిగే పరిస్థితి లేదు. అలాంటిది సపోర్టింగ్ రోల్ చేసిన స్నేహ తనకు సీన్లు లేవే అని అడిగినంత మాత్రాన వచ్చిన ఒరిగేది ఏమి లేదు. ఎంత ఓపెన్ గా బ్లాస్ట్ అయినా ప్రయోజనం లేదు కాని మీడియా ముందు గోడు వెళ్ళబోసుకోవడం ఒకందుకు మంచిదే. ఇంకొకరు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది