Begin typing your search above and press return to search.

స్నహ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్‌

By:  Tupaki Desk   |   14 April 2015 8:27 AM GMT
స్నహ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్‌
X
సినిమాల్లో ఎన్నిసార్లు తాళి కట్టించుకున్నా నిజ జీవితంలో ఆ క్షణం వచ్చినపుడు ఉండే ఉద్వేగమే వేరు. తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హోమ్లీ లేడీ స్నేహ మెడలో తాళి పడుతున్న క్షణం ఎంత ఉద్వేగానికి గురైందో ఆమె పెళ్లి వీడియో చూసిన వాళ్లందరికీ తెలుసు. ఇక తెరమీద ఓ బిడ్డకు ఎన్నిసార్లు తల్లిగా నటించినా నిజ జీవితంలో తల్లి కాబోతుంటే వచ్చే ఆనందమే వేరు. ఇప్పుడా ఆనందాన్నే ఆస్వాదిస్తోంది స్నేహ. మూడేళ్ల కిందట తమిళ నటుడు ప్రసన్నను పెళ్లాడిన స్నేహ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ప్రసన్న ట్విట్టర్లో జనాలతో పంచుకున్నాడు.

''ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరికీ ఓ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. త్వరలోనే మా ఇంట్లోకి రాబోతున్న ఓ కొత్త మెంబర్‌ కోసం అందరం ఎదురు చూస్తున్నాం'' అని ట్వీట్‌ చేశాడు ప్రసన్న. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ 2009లో అప్పుడప్పుడే తమిళ ఇండస్ట్రీలో ఎదుగుతున్న ప్రసన్నతో కలిసి అచ్చముండు అచ్చముండు అనే సినిమాలో నటించింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మొదలైంది. రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2012లో పెళ్లి చేసుకుంది. స్నేహ ఈ మధ్యే 'సన్నాఫ్‌ సత్యమూర్తి' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.