Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 11 April 2018 2:01 PM GMTతన సంచలన ఆరోపణలతో టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోన్న శ్రీరెడ్డి తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సభలలో ఉపన్యాసాలిస్తారని, కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలని శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. పవన్ గారికి ఇండస్ట్రీ నుంచే చాలా పేరు వచ్చిందని, ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారని, అటువంటి పవన్ గారు ఈ సమస్యపై స్పందించకపోవడం సరికాదని చెప్పింది. సినిమాల్లో లేను కాబట్టి ఇండస్ట్రీతో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ వ్యవహరించడం సరికాదని, ప్రజా సమస్యలపై స్టేజీ మీద ఉపన్యాసాలు దంచే పవన్ గారు తన సమస్యపై స్పందించాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా తనకు జరిగిన అన్యాయం, టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై చర్చించుకుంటున్నారని, అటువంటిది ఈ విషయం పవన్ కు తెలీదంటే తాను నమ్మనని శ్రీరెడ్డి చెప్పింది. ఇది మహేష్ కత్తి వ్యవహారం కాదని, ఓ ఆడపిల్ల బ్రతుకుకు సంబంధించిన అంశమని శ్రీరెడ్డి వాపోయింది. ఇలా చేయడం తప్పు అని, తప్పు చేసిన వారిని.... పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకులను కాపాడే ప్రయత్నం చేయవద్దని పవన్ సందేశమివ్వాలని శ్రీరెడ్డి కోరింది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరెడ్డి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలపై కూడా శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. మనకు సమస్య వచ్చినపుడు మనమంతా కలిసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల స్పందించాల్సిన అవసరముందని, అదే నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని శ్రీరెడ్డి తెలిపింది. ప్రపంచ తెలుగు మహాసభలు, కల్యాణ లక్ష్మీ, షీ టీమ్స్ అంటూ చాలా వాటిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కానీ, తన సమస్యపై కేటీఆర్ గారు, కవిత గారు ఇప్పటివరకు స్పందించకపోవడం తనను చాలా కలచి వేసిందని శ్రీరెడ్డి ఆరోపించింది. తనపై కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా చానెళ్లు ఎదురుదాడి చేస్తున్నాయని, సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని శ్రీరెడ్డి ఆరోపించింది. నీకు ఇష్టం లేకుండానే వారితో తిరిగావా...అలా చేయించుకున్నావా...అంటూ తనను విమర్శిస్తున్నారని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఎక్స్ ప్లాయిటేషన్ (స్వప్రయోజనం కోసం ఇతరులను వాడుకొని వారికి అన్యాయం చేయడం....దోపిడీ) అని, తనకు ఇష్టం లేకపోయినా...సినిమాల్లో అవకాశాల కోసం తప్పని సరి పరిస్థితుల్లో అలా చేసేలా వారు ప్రేరేపించినందువల్లే అలా చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయానని, తనను రాబందుల్లా పీక్కు తినవద్దని కోరింది. తన శరీరం - మనసు - కుటుంబం అంతా చెదిరిపోయి రోడ్డు మీదకు వచ్చామని, ఇంతకన్నా తమను రోడ్డు మీదకు లాగవద్దని శ్రీరెడ్డి కన్నీటి పర్యంతమైంది.