Begin typing your search above and press return to search.

బాంబులు పేల్చడం ఆపని శ్రీరెడ్డి

By:  Tupaki Desk   |   17 March 2018 4:35 AM GMT
బాంబులు పేల్చడం ఆపని శ్రీరెడ్డి
X
అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఏ సినిమాల్లో పేరు తెచ్చుకుందో కూడా సగటు ప్రేక్షకుడికి పూర్తి అవగాహన లేని హీరొయిన్ శ్రీరెడ్డి ఒక్క వెబ్ ఛానల్ ఇంటర్వ్యూ తో పాపులర్ కావడం గమనిస్తూనే ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగడం లేదు. న్యూస్ ఛానల్స్ పోటీ పడి మరీ తనను లైవ్ డిబేట్స్ కు పిలిచి అగ్నికి ఇంకా ఆజ్యం పోస్తున్నారు. తను చెబుతున్నవి నిజాలా కాదా అనే నిర్ధారణకు రాకుండానే పరిశ్రమ గురించి తనకు తోచింది మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. తన వీడియోలు వైరల్ కావడంతో మా స్టూడియో కు రమ్మంటే మా స్టూడియోకు రమ్మని శ్రీరెడ్డి మీద ఒత్తిడి కూడా ఎక్కువైందని టాక్. ఈ నేపధ్యంలో తను టార్గెట్ చేసిన స్టార్ హీరోలు - దర్శకులు - నిర్మాతలు నేరుగా స్పందించకపోయినా అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది అని ఆరా తీస్తున్నట్టు టాక్.

శ్రీరెడ్డి ముఖ్యంగా అవకాశాల కోసం ఏకాంత సేవకు రమ్మనే ఇండస్ట్రీ పెద్దల గురించి గట్టి బాణాలే విసురుతోంది. అవకాశాల కోసం ఒక పెద్ద నిర్మాత కొడుకుతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రేమాయణం నడపాల్సి వచ్చిందని చెప్పిన శ్రీరెడ్డి పేరుని ధైర్యంగా ప్రస్తావించలేకపోవడం గమనార్హం. ఛాన్స్ కావాలి అంటే పిలిచిన వారు ఎలా ఉన్నా ఎంత అందవికారులైనా ఎంత దురలవాట్లు ఉన్నా భరించక తప్పదని, ఇటీవలే తన స్నేహితురాలు దీని గురించి చెప్పుకుని ఏడ్చిందని చెప్పింది. కుల పిచ్చి పరిశ్రమలో అందరికీ ఉందని, ఆఖరికి తిండి విషయంలో కూడా విభజించి పెడతారని సెలవిచ్చింది శ్రీరెడ్డి. కొండ మీద కోతులే కావాలనుకునే వాళ్ళకు తెలుగు అమ్మాయిలు కనిపించరని చురక వేసింది.

ప్రభాస్ మీద డైరెక్ట్ ఎటాక్ చేసిందీ శ్రీరెడ్డి. హైట్ ఉన్న వాళ్ళతో తప్ప ప్రభాస్ నటించడని నిత్యా మీనన్ అద్భుతమైన నటి అయినప్పటికీ ఈ కారణంగానే చేసుండడని నిత్యతో పాటు సమంతా పేరును కూడా జోడించేసింది. ఇవన్ని ప్రస్తుతానికి నిరాధారాలే. టీవీలో ఆన్ లైన్ లో తను చెప్పిన విషయాలు సంచలనాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ వాటిలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం ఆధారాలు చూపక తప్పదు. మరి శ్రీరెడ్డి వాటి సమేతంగా ఏదైనా చెబితే బాగుంటుంది కాని ఇలా ఛానల్ వాళ్ళు అడుగుతున్నారని ఆరోపణలు మాత్రమే చేయటం సరి కాదు అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.