Begin typing your search above and press return to search.
బాలచందర్ గారు నా ముఖంపైనే ఆ మాట చెప్పేశారు!
By: Tupaki Desk | 20 Jan 2022 9:30 AM GMTసుధ .. తెలుగు తెరపై అక్క .. వదిన .. అమ్మ పాత్రలకు గ్లామర్ ను తీసుకొచ్చిన నటి. 90వ దశకం నుంచి తెలుగులో ఆమె తన జోరును కొనసాగిస్తూనే వస్తున్నారు. వివిధ భాషల్లో 975 సినిమాలు చేసిన ఆమె, తనే ప్రధాన పాత్రగా 'మాతృదేవోభవ' సినిమాను చేశారు. హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. " నేను ఇంతకాలం పాటు ఇండస్ట్రీలో ఉండటానికి మా అమ్మా నాన్నల ఆశీస్సులు ఒక కారణమైతే, ప్రేక్షకుల అభిమానం మరో కారణం.
ఒక రోజున హరనాథ్ రెడ్డిగారు నాకు కాల్ చేసి, ఫోన్ లోనే 'మాతృదేవోభవ' కథను చెప్పారు. టైటిల్ రోల్ ను నేనే చేయాలని అన్నారు. ఇంతకుముందు నేను చాలా సినిమాలు చేసినప్పటికీ, అంతటి బరువైన పాత్రను చేయగలనా? అనే భయం వేసింది. ఆ తరువాత అలాంటి పాత్రను వదులుకోకూడదనే ఉద్దేశంతో, ఆ సినిమా చేస్తానని చెప్పాను. ఈ కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు మనం ఏమైతే చూస్తుంటామో .. ఏవైతే వింటూ ఉంటామో అదే ఈ సినిమాలో ఉంటుంది. ఒక తల్లి తన పిల్లలపై ఎలాంటి ఆశలు పెట్టుకుంటుంది? చివరికి వాళ్లు ఏం చేశారు? అనేదే కథ.
ఈ సినిమాలో నా భర్తగా సుమన్ గారు కనిపిస్తారు. పిలల్లలుగా జెమినీ సురేశ్ .. శ్రీహర్ష .. చమ్మక్ చంద్ర .. శ్రీనివాస్ చేశారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో పోసాని .. రవిబాబు .. అపూర్వ .. సూర్య కనిపిస్తారు. ఈ సినిమాలో నా పై మూడు పాటలు ఉంటాయి. క్లైమాక్స్ సాంగ్ ను చరణ్ గారు పాడారు. ఆ పాట చూస్తూ కన్నీళ్లు పెట్టనివారుండరు. ఈ రోజుకి నేను ఇన్ని సినిమాలు చేయడానికీ .. ఇంత పేరు రావడానికి కారకులు మా గురువుగారు కె.బాలచందర్ గారు. ఈ క్రెడిట్ అంతా కూడా ఆయనకే దక్కుతుంది.
1981లో నన్ను బాలచందర్ గారు తెరకి పరిచయం చేశారు. ఆ తరువాత గ్యాప్ వచ్చింది. అప్పుడు ఆయన నన్ను పిలిచి, "నువ్వు గ్లామర్ పాత్రలకి పనికి రావు .. హీరోయిన్ గానే చేయాలి అనుకుంటే ఇండస్ట్రీలో ఉండవు. నువ్వు ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే నేను ఇచ్చిన అక్క క్యారెక్టర్ చేయి. ఆ తరువాత వదిన .. అమ్మ .. అమ్మమ్మ .. ఇలా ఇక చాలు అనుకుని వెళ్లిపోయేవరకూ ఇండస్ట్రీలో ఉంటావు" అని అన్నారు. కొంతసేపు ఆలోచించుకున్న తరువాత ఆయన సినిమాలో హీరోయిన్ కి సిస్టర్ రోల్ చేయడానికి అంగీకరించాను. ఆ రోజున ఆయన మాట వినడం వల్లనే ఈ రోజున ఈ స్థానంలో ఉన్నాను" అని చెప్పుకొచ్చారు.