Begin typing your search above and press return to search.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 29 April 2017 6:36 AM GMTతెలుగు సినీ పరిశ్రమను గత కొన్నేళ్లలో అత్యంత బాధపెట్టిన అంశం.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య. అతను చనిపోయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఇప్పుడా విషయం తలుచుకున్న మనసు చివుక్కుమంటుంది. ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగేలా కనిపించిన ఉదయ్ కిరణ్.. చివరికి ఇలాంటి స్థితికి చేరుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం అతడికి ఏమొచ్చిందన్నది ఎవ్వరికీ అంతుబట్టని విషయం. సినిమా అవకాశాలు తగ్గినంత మాత్రాన ఉదయ్ ప్రాణం తీసుకునేంతగా బాధపడ్డాడా అన్నది అందరి సందేహం. ఐతే సీనియర్ నటి సుధ చెబుతున్న దాని ప్రకారం ఉదయ్ కిరణ్ అంతకుముందు చాలా ఏళ్ల నుంచే డిప్రెషన్ తో బాధపడుతున్నాడట.
చిరంజీవి కూతురితో నిశ్చితార్థం రద్దయినప్పటి నుంచి ఉదయ్ కిరణ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని.. ఆ ప్రభావం నుంచి చాలా ఏళ్ల పాటు బయటపడలేకపోయాడని సుధ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఉదయ్ తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతను తరచుగా తమ ఇంటికి వచ్చేవాడని.. తన బాధను పంచుకునేవాడని సుధ చెప్పింది. ఒక దశలో ఉదయ్ ను తాను కొడుకుగా దత్తత తీసుకోవాలని కూడా అనుకున్నట్లు ఆమె తెలిపింది. ఆ నిశ్చితార్థం రద్దు చాలా ఏళ్ల పాటు ఉదయ్ ను వెంటాడింది. ఉదయ్ ఆత్మహత్యాయత్నం నుంచి ప్రాణాలతో బయటపడి ఉంటే అతనా పని చేసినందుకు చెంప పగలగొట్టేదాన్నని సుధ ఆవేదనతో చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/