Begin typing your search above and press return to search.
మిసెస్ మణిరత్నం.. కిరాక్ రెస్పాన్స్ ఇచ్చిందిగా!
By: Tupaki Desk | 18 Jun 2019 10:07 AM GMTఈ కాలం లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం. చాలా అబద్ధాలు అవి నిజాలు అనే స్థాయిలో ప్రచారం అవుతుంటాయి. మరోవైపు కొన్ని నిజాలను జనాలు అబద్దాలు అనుకుంటారు. నిన్న సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియావరకూ కవర్ చేసిన న్యూస్ 'గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మణిరత్నం'. ఈ విషయంపై మణి సార్ సతీమణి సుహాసిని స్పందించారు.
తన ట్విట్టర్ ఖాతా ద్వారా "నా భర్త ఉదయం 9.30 కు ఆఫీసుకు వెళ్ళారు. రూప గారు రుచికరమైన రోటీ.. స్వీట్ మ్యాంగో పికిల్ తీసుకొచ్చ్చారు. మా ఆయన చక్కగా తిని.. తన కొత్త సినిమా స్క్రిప్టుకు మసాలాను కలిపేందుకు ఆఫీసుకు వెళ్ళారు. మా జీవితాలను స్పైసీగా చేసినందుకు కృతజ్ఞతలు రూప." అంటూ ట్వీట్ చేశారు. సుహాసిని మేడమ్ గారి సెటైర్ అర్థం అయింది కదా..? మణిరత్నం గారు ఆరోగ్యంగా ఉన్నారని.. మీడియాలో వచ్చిన వార్తలన్నీ గాసిప్స్ అని ఈ విధంగా చెప్పారు. గుండెపోటు వస్తే ఎవరైనా ఆవకాయ తిని ఆఫీసుకు వెళ్తారా? మేడమ్ చమత్కారం ఆ రేంజ్ లో ఉంది.
సాధారణంగా ఇలాంటి వార్తలు మీడియాలో వస్తే .. ఆ సెలబ్రిటీ కుటుంబ సభ్యులు మీడియాపై అగ్గిమీద గుగ్గిలం అవుతారు. మీడియాకు బాధ్యత ఉండాలని..నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయకూడదని వీలైనంత గట్టిగా క్లాసులు పీకుతారు. కానీ మిసెస్ మణిరత్నం మాత్రం వీటికి స్పందనగా అవకాయ-ఆఫేసు జోక్ వేసింది!