Begin typing your search above and press return to search.
27 యేళ్ల తర్వాత ఒంటరిగా..
By: Tupaki Desk | 9 Dec 2018 11:36 AM GMTకన్నడ రెబల్ స్టార్ అంబరీస్ ఇటీవలే అనారోగ్య కారణంతో తుది శ్వాస విడిచిన విషయం తెల్సిందే. కన్నడ సినీ పరిశ్రమతో పాటు సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. కన్నడ సినీ పరిశ్రమ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి తేరుకుంటున్నారు. ఇక అంబరీస్ సతీమణి అయిన సుమలత మరోసారి వారి పెళ్లి రోజు సందర్బంగా తమ మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టి ఆమె అంబరీష్ పై తనకు ఉన్న అభిమానంను అభిమానులతో పంచుకున్నారు.
సోషల్ మీడియాలో అంబరీష్ తో తాను గతంలో తీసుకున్న ఫొటోలు పోస్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో తన మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తం చేసింది. 27 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 8న ఒంటరిగా ఉన్నాను. ఇన్నాళ్ల తర్వాత నువ్వు నా పక్కన లేకుండా పెళ్లి రోజు వచ్చింది. నా ప్రపంచంలో నువ్వు నాకు ఒక బింధువు మాత్రమే కాదు, నా ప్రపంచమే నువ్వు, నన్ను చేయి పట్టి నువ్వు నడిపించిన తర్వాతే నా నడక ప్రారంభం అయ్యింది.
ఎన్నాళ్లయినా నిన్ను మరువలేను, ఎప్పటికి నీ ద్యాసలోనే నా జీవితం సాగిస్తాను. నీ ప్రేమతో నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చావు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మమ్ములను చూసుకుంటావనే నమ్మకం మాకు ఉంది. మన కుమారుడికి నీవే ఆశీర్వాదం ఇవ్వాలి. నీ అభిమానుల్లో నిన్ను చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తాను అంటూ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో సుమలత పోస్ట్ అంబరీస్ హృదయాలను ద్రవింపజేసింది.